Chiranjeevi : బాస్ బర్త్‌డే.. మెగా అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయ్..

ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఫ్యాన్స్‌కి బాస్.. సాలిడ్ బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్నారు..

Chiranjeevi : బాస్ బర్త్‌డే.. మెగా అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయ్..

Mega Updates

Chiranjeevi: ఆగస్టు 22 సినీ ప్రియులకు మరీ ముఖ్యంగా మెగాభిమానులకు స్పెషల్ డే.. ఎందుకంటే.. ఆరోజు తెలుగు చలనచిత్ర చరిత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాస్, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఫ్యాన్స్‌కి బాస్ సాలిడ్ బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్నారు.

Acharya : మెగాస్టార్ పోస్టర్ లీక్..!

ఇప్పటికే ఫ్యాన్స్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజెయ్యడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ లెవల్లో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు.

Chiranjeevi : మెగాస్టార్ స్పీడ్ మామూలుగా లేదుగా..!

ఇక ఇండస్ట్రీ వైపు నుండి మెగా మేకర్స్ అంతా మెగాస్టార్ బర్త్‌డే ట్రీట్‌కి సన్నాహాలు చేసుకుంటున్నారు. తనయుడు చరణ్ తండ్రితో కలిసి నటిస్తూ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘ఆచార్య’ రిలీజ్ డేట్‌‌‌‌తో కూడిన పోస్టర్ వదలబోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2022 జనవరి 7న ‘ఆచార్య’ విడుదల కానుందని తెలుస్తోంది.

Chiranjeevi : జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో చిరంజీవి కోవిడ్ నిధి సేక‌ర‌ణ..

ఇక ‘లూసీఫర్’ రీమేక్‌కి సంబంధించిన అప్‌డేట్ కూడా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. చిరు బర్త్‌డే నాడు టైటిల్ రివీల్ చేసే అవకాశముంది. వీలైతే ఫస్ట్ లుక్ కూడా రావచ్చని అంటున్నారు. అలాగే బాబీ డైరెక్షన్లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సినిమాతో పాటు ‘వేదాళం’ రీమేక్ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ రానున్నాయని సమాచారం.

Chiranjeevi : ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ విషయమై.. మెగాస్టార్ ఆధ్వ‌ర్యంలో మీటింగ్..