Mega154: మలేషియా చెక్కేస్తున్న వాల్తేర్ వీరయ్య..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెడుతూ శరవేగంగా వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు మోహన్ రాజా....

Mega154: మలేషియా చెక్కేస్తున్న వాల్తేర్ వీరయ్య..?

Mega154 Waltair Veerayya Next Schedule In Malaysia

Mega154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెడుతూ శరవేగంగా వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్ అనే సినిమాను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్న మెగాస్టార్, దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో భోళాశంకర్ అనే సినిమాను కూడా ప్రారంభించాడు. అంతేగాక, మరో యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను అనౌన్స్ చేసి ఈ సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించేశాడు. ఇక ఈ సినిమాకు ‘‘వాల్తేరు వీరయ్య’’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేయబోతున్నట్లు ఇటీవల దర్శకుడు బాబీ ఇదే విషయాన్ని కన్ఫం చేశాడు.

Mega154: వాల్తేర్ వీరయ్య కోసం రామారావు డ్యూటీ ఎక్కుతున్నాడా..?

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌ను మలేషియాలో జరుపుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ షెడ్యూల్‌ను జూన్ 5 నుండి మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ షెడ్యూల్ మలేషియాలో ఏకంగా మూడు వారాల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న చిరు, తిరిగి రాగానే గాడ్‌ఫాదర్ సినిమాలోని ఓ సాంగ్ చిత్రీకరణలో పాల్గొని, అటుపై వాల్తేర్ వీరయ్య కోసం మలేషియా చెక్కేస్తాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Mega154: చిరు లీక్స్.. వాల్తేరు వీరయ్య కన్ఫం!

కాగా.. ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరిన్ త్రేజా, సముధ్రకని, బాబీ సింహాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారా.. ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.