Acharya: హిందీలో ఆచార్య మెగాస్టార్.. బాలీవుడ్ నిర్మాతలతో సంప్రదింపులు?

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిన సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా రకరకాల కారణాలతో పలుమార్లు వాయిదా పడగా ఫైనల్ గా ఏప్రిల్ 29వ..

Acharya: హిందీలో ఆచార్య మెగాస్టార్.. బాలీవుడ్ నిర్మాతలతో సంప్రదింపులు?

Acharya (1)

Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిన సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా రకరకాల కారణాలతో పలుమార్లు వాయిదా పడగా ఫైనల్ గా ఏప్రిల్ 29వ తేదీన విడుద‌ల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటైర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. కొరటాల శివ సినిమా కావడంతో రికార్డులు తిరగరాయడం ఖాయంగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

Acharya: ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్‌లో హీట్ పెంచనున్న పెద్ద సినిమాలు

కాగా, ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మాస్ రాజా రవితేజ కూడా ఖిలాడీ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేశారు. రవితేజ సినిమానే ఉత్తరాదిన రిలీజ్ చేసినపుడు మెగాస్టార్ సినిమా.. అది కూడా కొరటాల దర్శకత్వంలో రాబోతున్న సినిమాని హిందీలో రిలీజ్ చేస్తే తప్పకుండా మంచి ఆదరణ లభించనుంది. అందుకే ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో రామ్ చరణ్ స్వయంగా రంగంలోకి దిగాడట.

Acharya: ఆచార్యలో పాటపై మంత్రికి మెమోరండం ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్లు

ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నాడు. నెలలో నాలుగైదు సార్లు ముంబై వీధుల్లో కనిపించాడు. ఇదంతా ఆచార్య హిందీ రిలీజ్ కోసమేనని ఇండస్ట్రీ టాక్. హిందీ బడా నిర్మాతలని.. ప్రముఖ డిస్టిబ్యూటర్లతో మంతనాలు జరుపుతున్నాడని.. మంచి రేటుకే హిందీ హక్కులు అమ్మడం ఖాయంగా చెప్పుకుంటున్నారు. చిరంజీవికి బాలీవుడ్ కొత్తేమి కాదు. 1990ల్లోనే హిందీ సినిమాలు చేశాడు. అయితే.. అప్పుడు అక్కడ ఆదరణ లేకపోవడంతో వెనక్కు తగ్గాడు. కానీ.. ఇప్పుడు మన సినిమాలకి అక్కడ ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే ఆచార్యతో మరోసారి మెగా మేనియా కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది.