ఈ తరానికి కనెక్ట్ అయ్యే సినిమా ‘జార్జ్ రెడ్డి’ – మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘జార్జ్ రెడ్డి’ లిరికల్ సాంగ్ రిలీజ్.. ఈ నెల 22న సినిమా భారీగా విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : November 19, 2019 / 09:36 AM IST
ఈ తరానికి కనెక్ట్ అయ్యే సినిమా ‘జార్జ్ రెడ్డి’ – మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘జార్జ్ రెడ్డి’ లిరికల్ సాంగ్ రిలీజ్.. ఈ నెల 22న సినిమా భారీగా విడుదల కానుంది..

‘జార్జ్ రెడ్డి’.. గతకొద్ది రోజులుగా మీడియాలో బాగా వినబడుతుందీ పేరు.. రామ్ గోపాల్ వర్మ, సుకుమార్, పూరి జగన్నాధ్ వంటి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ‘జార్జ్ రెడ్డి’ సినిమాను ప్రశంసిస్తున్నారు. మరోవైపు ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది మూవీ టీమ్. మంగళవారం ఈ సినిమాలోని ఓ పాటను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

‘అడుగడుగు’ అనే లిరికల్ సాంగ్ చిరంజీవి తన ఇంట్లో చిత్రయూనిట్ సమక్షంలో విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ట్యూన్‌కి, మేఘ్-ఊ-వత్ లిరిక్స్ రాయడంతో పాటు ర్యాప్ పాడరు. రేవంత్ పూర్తి సాంగ్ పాడారు..

Read Also : కూలి పని చేసి నన్ను సినిమాలకు తీసుకెళ్లేవాడు కిట్టయ్య – సుకుమార్ భావోద్వేగం

అనంతరం చిరంజీవి ‘జార్జ్ రెడ్డి’ సినిమా గురించి మాట్లాడారు. చిత్రబృందాన్ని అభినందించారు. సందీప్ మాధవ్, అభిషేక్ అగర్వాల్, మంగ్లీ, జీవన్ రెడ్డి, సంజయ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రయంలో పాల్గొన్నారు. ఈ నెల 22న ‘జార్జ్ రెడ్డి’  రిలీజవుతోంది.

https://youtu.be/tEngiWqMF8M