చిరు 152 షురూ..

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Published By: sekhar ,Published On : October 8, 2019 / 07:59 AM IST
చిరు 152 షురూ..

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ‘సైరా నరసింహా రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ తన తర్వాతి సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి  కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. అంజనా దేవి, సురేఖ, సుస్మిత, చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ, తిరు, నిర్మాతలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, డి.వి.వి.దానయ్య, జెమిని కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్‌నిచ్చారు..

Read Also : రాజు గారి గది 3 – సెన్సార్ పూర్తి : అక్టోబర్ 18 విడుదల..

శివ ఆస్థాన కవి రామజోగయ్య శాస్త్రి పాటలు రాయనున్నారు. ‘జనతాగ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ సినిమాలకు పనిచేసిన తిరు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సురేష్ స్రాజన్.