Megastar : మరోసారి వినాయక్ – చిరంజీవి కాంబినేషన్?
సెకండ్ ఇన్సింగ్స్ తో సత్తాచాటుతున్న మెగాస్టార్ ఇటీవల ఆచార్యతో హిట్ ట్రాక్ తప్పారు. అయితే తనకు హిట్ అవసరమైనప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఒకప్పటి డైరెక్టర్ తోనే మళ్లీ.......

VV Vinayak : సెకండ్ ఇన్సింగ్స్ తో సత్తాచాటుతున్న మెగాస్టార్ ఇటీవల ఆచార్యతో హిట్ ట్రాక్ తప్పారు. అయితే తనకు హిట్ అవసరమైనప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఒకప్పటి డైరెక్టర్ తోనే మళ్లీ ఇప్పుడు సినిమా చెయ్యబోతున్నారు మెగాస్టార్. ఇప్పుడు ఫామ్ లో లేకపోయినా చిరంజీవితో ఛాన్స్ కొట్టేసాడు ఆ డైరెక్టర్. ఒక్కోసారి రావడం లేట్ అవ్వొచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా అంటారు. ఈమాట వినాయక్ కి మాత్రం కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది. మెగాస్టార్ సెకండ్ ఇన్సింగ్స్ ని ఖైదీనెం.150 బ్లాక్ బస్టర్ హిట్ తో స్టార్ట్ చేసిన వినాయక్ కి తర్వాత మెగాస్టార్ తో సినిమా ఛాన్స్ ఇలా వచ్చి అలా మిస్ అయ్యిపోయింది. అయితే తనను హిట్ ట్రాక్ ఎక్కించాలంటే మళ్లీ వినాయకే కావాలంటూ అడిగిమరీ పిలిపించుకుంటున్నారు చిరంజీవి.
గతంలో టాగోర్ లాంటి బ్లాక్ బస్టర్, సెకండ్ ఇన్సింగ్స్ లో ఖైదీనెం.150తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వినాయక్ తో సినిమా చెయ్యబోతున్నారు చిరంజీవి. అందుకోసం వినాయక్ ని పిలిపించి కథ రెడీ చెయ్యమని కూడా చెప్పారు మెగాస్టార్. ఇప్పటికే మోహన్ రాజా, వెంకీ , బాబీ, మెహర్ రమేష్ డైరెక్షన్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఆ సినిమా నెంబర్లు ఎలా ఉన్నా వీటి మధ్యలో వినాయక్ తో ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని రెడీ చెయ్యమని వినాయక్ కి చెప్పారు మెగాస్టార్.
వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో బాలీవుడ్ లో చత్రపతి మూవీ రీమేక్ చేస్తున్నారు. దీనికి సంబందించి 10 రోజులే షూటింగ్ మిగిలి ఉంది. షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వినాయక్ చిరంజీవి సినిమా మీదే ఫోకస్ చెయ్యబోతున్నారు.
Star Heros : పండగలని లాక్ చేసుకుంటున్న హీరోలు..
నిజానికి గాడ్ ఫాదర్ టైమ్ లోనే వినాయక్ తో సినిమా చెయ్యాల్సి ఉంది. లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ వినాయక్ చేత డైరెక్ట్ చేయిద్దామనుకున్నారు. అంత పవర్ ఫుల్ ఇమేజ్ ని వినాయక్ బాగా చూపిస్తాడని ఫ్యాన్స్ కూడా మెగాస్టార్ నుంచి ఇదే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు కాబట్టీ ఇలాంటి పొలిటికల్ స్టోరీ వినాయక్ డీల్ చేస్తే హిట్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుందని ఫీలయ్యి వినాయక్ కి గాడ్ ఫాదర్ సినిమా బాధ్యతలు అప్పచెప్పారని అప్పట్టో టాక్ నడిచింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ తో వినాయక్ ప్లేస్ లో మోహన్ రాజా వచ్చేశారు. అందుకే అప్పుడు మిస్ అయిన ఛాన్స్ వినాయక్ కి ఇప్పుడొచ్చింది. ఈ సారి వినాయక్ డైరెక్షన్లో మాంచి పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయ్యారు చిరంజీవి. మరి ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఎప్పటికి సెట్ అయ్యేనో.
- Maruthi : ప్రజారాజ్యం పార్టీకోసం పనిచేశాను.. డైరెక్టర్ గా ఫస్ట్ యాక్షన్ చెప్పింది చిరంజీవి గారికే..
- Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
- Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
- Tollywood stars : ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కూతురి పెళ్ళిలో స్టార్ల సందడి
- Mega 154 : సంక్రాంతికి కలుద్దాం అంటున్న మెగాస్టార్.. బాబీ డైరెక్షన్లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ..
1Maharashtra : ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు..కొత్త ప్రభుత్వం రాకతో షాకులు షురూ..
2Minister Kishan Reddy: బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ ఆటంకాలు కలిగిస్తుంది
3Tollywood : హిట్ కొట్టిన ఫస్ట్ హాఫ్.. సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటో??
4PM Modi: 3న బీజేపీ బహిరంగ సభ.. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి
5Senior Resident Doctors : కొనసాగుతున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన
6PM Modi : భీమవరంలో భారత్ లోనే భారీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
7Sanjay Raut : నేడు ఈడీ ముందు హాజరు కానున్న సంజయ్ రౌత్
8Minister Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు
9Alluri Sitaramaraju : మన్నెం వీరుడు..అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు
10Gossips : సెలబ్రిటీల మీద చక్కర్లు కొడుతున్న గాసిప్స్.. నిజమేనా??
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!