Chiranjeevi : మెగాస్టార్.. మెగాక్రేజ్.. తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ కు చీఫ్ గెస్ట్..

తెలుగు ఓటీటీ ఆహా సరికొత్త ప్రోగ్రామ్స్ తో ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవలే తెలుగు సింగర్స్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని..............

Chiranjeevi : మెగాస్టార్.. మెగాక్రేజ్.. తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ కు చీఫ్ గెస్ట్..

Megastar

Aha :  తెలుగు ఓటీటీ ఆహా సరికొత్త ప్రోగ్రామ్స్ తో ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవలే తెలుగు సింగర్స్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది సింగర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇటీవలే తెలుగు ఇండియన్ ఐడల్ సెమి ఫైనల్స్ కి బాలయ్య బాబు గెస్ట్ గా వచ్చి తన టైమింగ్ తో అదరగొట్టారు.

తాజాగా ఫైనల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నారు. 15 వారాల సంగీత ప్రయాణం ఇప్పు డు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఫైనల్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ పోటీపడనున్నారు. మరి ఈ ఐదుగురిలో ఎవరు విన్ అవ్వనున్నారు, ఎవరు చిరంజీవి చేతుల మీద కప్ తీసుకోనున్నారో చూడాలంటే ఈ ఫైనల్ ఎపిసోడ్ జూన్ 17న ఆహాలో చూడాల్సిందే. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా మెగాస్టార్ అభిమానులు, ప్రేక్షకులు ఈ ప్రోమో చూసి అందులో బాస్ గ్రెస్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రోమో రిలీజ్ అయిన కొద్ది క్షణాలకే ట్రెండింగ్ లో ఉంది.

RGV: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆర్జీవీ, కొండా దంపతులు

ఈ ప్రోమోలో చిరంజీవి మంచి డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్స్ అంతా కలిసి చిరు పాటలతో అదరగొట్టారు. ప్రణతి అనే కంటెస్టెంట్ వాళ్ళ అమ్మతో కలిసి ‘సందెపొద్దుల కాడ’ పాట పాడటంతో చిరంజీవి వారిద్దరితో కలిసి ఒక స్టెప్ వేశారు. అంతే కాకుండా ప్రణతి భవిష్యత్తులో పెద్ద సింగర్ అవుతుందని ఒక పెన్ గిఫ్ట్ గా ఇచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. దీంతో ప్రణతి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత జయంత్ అనే కంటెస్టెంట్ పాడిన ఖైదీ 150 సినిమా పాటకి అతనితో కలిసి చిరు డ్యాన్స్ వేసి కూలింగ్ గ్లాసెస్ బహుకరించారు.

ఇలా మెగాస్టార్ ఫుల్ జోష్ తో షోలో హడావిడి చేశారు. దీంతో ప్రోమో వైరల్ గా మారింది. అభిమానులు, ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కి చిరంజీవితో పాటు రానా, సాయి పల్లవి కూడా వచ్చారు. రానా చిన్నప్పుడు చరణ్ తో జరిగిన ఫన్నీ సన్నివేశాల్ని షేర్ చేసుకున్నారు. జడ్జిగా వ్యవహరిస్తున్న నిత్యామీనన్ కూడా ఒక సాంగ్ పాడి అలరించింది. ఇలా ప్రోమో ఆద్యంతం అలరించింది.