Megastar Chiranjeevi: నేనెప్పుడూ క్యాన్స‌ర్ బారిన ప‌డ‌లేదు.. అలా రాయ‌కండి.. చిరంజీవి ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి గ‌తంలో క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

Megastar Chiranjeevi: నేనెప్పుడూ క్యాన్స‌ర్ బారిన ప‌డ‌లేదు.. అలా రాయ‌కండి.. చిరంజీవి ట్వీట్

Megastar Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గ‌తంలో క్యాన్స‌ర్(cancer ) బారిన ప‌డ్డారు అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తానెప్పుడు క్యాన్స‌ర్ బారిన ప‌డ‌లేదని చెప్పుకొచ్చారు. క్యాన్స‌ర్ వ్యాధి ప‌ట్ల అవ‌గాహ‌న పెంచాల్సిన అవ‌సరం గురించి మాత్ర‌మే తాను మాట్లాడిన‌ట్లు తెలిపారు. గ‌తంలో తాను టెస్టులు చేయించుకుంటే నెగెటివ్ వ‌చ్చింద‌న్నారు. తాను ముందుగా టెస్టులు చేయించుకోకుంటే అది క్యాన్స‌ర్ కింద మారేదేమో అని మాత్ర‌మే తాను చెప్పిన‌ట్లు చిరంజీవి వెల్ల‌డించారు.

Kota Srinivasarao: టాలీవుడ్ హీరోల‌పై మండిప‌డ్డ కోటాశ్రీనివాస‌రావు.. ఆ వ్యాఖ్య‌లు పవన్ ను ఉద్దేశించేనా?

‘కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.

అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు’. అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Jabardasth Punch Prasad: జబర్దస్త్‌ కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం.. సాయం చేయాలంటూ ఇమ్మాన్యుయేల్ పోస్ట్‌