Chiranjeevi: మెగాస్టార్ కండీషన్స్ అప్లై.. సర్ ప్రైజింగ్ గెస్ట్స్ ఉండాల్సిందే!

భారీ బడ్జెట్ అవసరం లేదు.. ఫారెన్ రిచ్ లోకేషన్స్ లో పని లేదు.. కానీ ఓ స్టార్ కండీషన్ పెడుతున్నారు మెగాస్టార్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల దగ్గర నుంచి పట్టాలెక్కే..

Chiranjeevi: మెగాస్టార్ కండీషన్స్ అప్లై.. సర్ ప్రైజింగ్ గెస్ట్స్ ఉండాల్సిందే!

Chiranjeevi

Chiranjeevi: భారీ బడ్జెట్ అవసరం లేదు.. ఫారెన్ రిచ్ లోకేషన్స్ లో పని లేదు.. కానీ ఓ స్టార్ కండీషన్ పెడుతున్నారు మెగాస్టార్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల దగ్గర నుంచి పట్టాలెక్కే ప్రాజెక్ట్స్ వరకు.. అదే కండీషన్ తో ముందుకెళ్తున్నాయి. అందరినీ వాడేస్తున్నారు చిరంజీవి. భారీ బడ్జెట్, రిచ్ లోకెషన్స్ వద్దంటున్నా.. సినిమాల్లో స్టార్ కాస్ట్ ఉండేలా చూసుకుంటున్నారు. తమ మూవీలోని కీ క్యారెక్టర్స్, స్పెషల్ రోల్స్ తో ఫ్యాన్య్ ను సర్ ప్రైజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆచార్యకు రామ్ చరణ్ ఫుల్ సపోర్ట్. కానీ అంతటితో ఆగలేదు. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. చిరూ జోడీగా కాజల్ ఉండనే ఉంది. వీళ్లతో పాటూ సోనూసూద్, సంగీత, రెజీనా లాంటి వాళ్లు కూడా ఆచార్యలో హల్చల్ చేయబోతున్నారు.

Shanmukh-Deepthi: దీప్తికి ఇదే షణ్ముఖ్ చివరి ముద్దు.. వీడియో వైరల్!

మోహన్ రాజా డైరెక్షన్ లో చిరూ గాడ్ ఫాదర్ చేస్తున్నారు. లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కూడా సర్ ప్రైజెస్ చాలానే ఉన్నాయి. పట్టుబట్టి ఓ కీ క్యారెక్టర్ కోసం నయనతారను తీసుకొచ్చారు. ఆమె మెగాస్టార్ కి జోడీగా నటించడం లేదు. నయన్ భర్తగా సత్యదేవ్ కనిపించే ఛాన్స్ ఉంది. ఇక ఇదే గాడ్ ఫాదర్ లో సర్ ప్రైజింగ్ గెస్ట్ గా సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడు. ఒరిజనల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన క్యారెక్టర్ ను సల్మాన్ కోసం రెడీ చేశారు. అలాగే ఇదే మూవీ కోసం చిరూ – సల్మాన్ పాట కోసం బ్రిట్నిస్పియర్స్ తో పాట పాడించేందుకు తమన్ ట్రై చేస్తున్నాడు.

Telugu Film Production: అప్ కమింగ్ హీరోలకు లిఫ్ట్ ఇస్తున్న స్టార్ ప్రొడ్యూసర్స్!

భోళాశంకర్ సినిమాకు చాలా మెరుపులనే యాడ్ చేస్తున్నారు. ఈ మూవీలో తమన్నా హీరోయిన్ కాగా కీర్తి సురేశ్ చెల్లెలిగా నటిస్తోంది. మెగా చెల్లెలుగా నటిస్తోన్న కీర్తి కోసం నాగశౌర్యను సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వేదాళం రీమేక్ గా మెహర్ రమేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇందులోని ఐటమ్ సాంగ్ లో స్మాల్ స్క్రీన్ ఫేం రష్మీ స్టెప్పులేయబోతుందనే ప్రచారం జరుగుతుంది. అన్నీ కుదిరితే రష్మీ – చిరూ పాట త్వరలోనే ఫ్లోర్ పైకెళ్లనుంది.

Disha Patani: వింటర్‌లో కూడా చెమటలు పట్టిస్తున్న దిశా!

చిరూ – బాబీ కాంబినేషన్లో ఈమధ్యే ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇందులో హీరోయిన్ గా శృతీ హాసన్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. చిరూ అండర్ కాప్ గా కనిపించే బాబీ సినిమాలో మాస్ రాజా కూడా నటిస్తారని చెప్తున్నారు. సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చే రవితేజ కూడా పోలీస్ క్యారెక్టర్ లో దడదడలాడిస్తారని టాక్. ఇక ఈ ప్రాజెక్ట్ లోనే బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీని సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Karishma Tanna: అందంతో మతిపోగొట్టడమే నీ పనా కరిష్మా!

ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్, బాబీ సినిమాల తర్వాత వెంకీ కుడుముల సినిమాను లైన్లో పెట్టారు చిరంజీవి. రీసెంట్ గానే ఈ సినిమాను ట్రిపుల్ ఆర్ నిర్మాత డివివి దానయ్య ప్రకటించారు. ఆ తర్వాత మెగా కాంబినేషన్ లో మారుతి, త్రివిక్రమ్ అంటూ చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. అయితే ఎవరితో చేసినా.. మంచి కంటెంట్ ఉన్న స్టోరీలే తీసుకుంటున్నారు.. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ కి నో చెప్తున్నారు చిరూ. బట్ కండీషన్స్ అప్లై సినిమాలో అవసరమైతే పుష్కలంగా స్టార్స్ ఉండాల్సిందే.