Chiranjeevi On Directors : టాలీవుడ్ డైరెక్టర్లపై చిరంజీవి సీరియస్… పద్దతి మార్చుకోవాలని హితవు

టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. వారి తీరుపై సెటైర్లు వేశారు. నటులు డైలాగులు నేర్చుకోవాలా? లేక నటనపై దృష్టి పెట్టాలా? అంటూ ఫైర్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి.(Chiranjeevi On Directors)

Chiranjeevi On Directors : టాలీవుడ్ డైరెక్టర్లపై చిరంజీవి సీరియస్… పద్దతి మార్చుకోవాలని హితవు

Chiranjeevi

Chiranjeevi On Directors : టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. వారి తీరుపై సెటైర్లు వేశారు. కొంతమంది దర్శకులు షూటింగ్ లొకేషన్ లోనే డైలాగులు అప్పటికప్పుడు రాసి వడ్డిస్తున్నారని చిరంజీవి ఆరోపించారు. ఇది నటులకు ఇబ్బందిగా మారుతోందన్నారు మెగాస్టార్.

నటులు డైలాగులు నేర్చుకోవాలా? లేక నటనపై దృష్టి పెట్టాలా? అంటూ ఫైర్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. లాల్ సింగ్ చడ్డా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఈ హాట్ కామెంట్స్ చేశారు. డైరెక్టర్ల తీరు కారణంగా కొందరు నటులు ఇబ్బంది పడుతున్నారని చిరంజీవి చెప్పుకొచ్చారు. టాలీవుడ్ డైరెక్టర్లు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు మెగాస్టార్. దర్శకులు, నిర్మాతలను ఉద్దేశించి చిరంజీవి ఈ కామెంట్స్ చేసినట్లు అర్థమవుతోంది. డైరెక్టర్లు తమ తీరు మార్చుకోవాలంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

”టాలీవుడ్ డైరెక్టర్ల ఆలోచనలో మార్పు రావాలి. అప్పటికప్పుడు డైలాగులు రాయడం వల్ల నటులు తమ నటనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ముందుగానే డైలాగులు రాయాలి. డైలాగులే ఇవే అని ఫిక్స్ అయిపోవాలి. ఆ డైలాగులు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. దీంతో సెట్స్ కి వెళ్లినప్పుడు తన డైలాగ్ ఏంటి అని ఏ నటుడు కూడా ఆలోచన చేయడు. కేవలం పెర్ఫార్మెన్స్ మీద మనసు పెడితే చాలు. అది రావాలి. బాలీవుడ్ లో జరిగేది అదే. బాలీవుడ్ లో నటులు డైలాగుల గురించి వర్రీ అవరు. డైలాగులు ఆల్రెడీ వాళ్ల మైండ్ లో ఉంటాయి. మనం ఎంత బెస్ట్ ఇవ్వగలము అనే దానిపై మాత్రమే దృష్టి పెడ్తారు. బాలీవుడ్ లో ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్ అదే. ఈ విషయాన్ని మన టాలీవుడ్ డైరెక్టర్లు అర్థం చేసుకోవాలి. ముందే డైలాగులు రాసుకోవాలి, డైలాగులు ఇవే అని ఫిక్స్ అయిపోవాలి” అని చిరంజీవి సూచించారు.

అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రం ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ మూవీకి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో చిరంజీవి, నాగ చైతన్య, అమీర్ ఖాన్‌లు పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

Sravana Bhargavi : వెనక్కి తగ్గిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్.. మరో వీడియో రిలీజ్

”సినిమా చూడకముందు.. ఏదో మాటిచ్చాం.. ప్రజెంట్ చేయాల్సిందే అనుకున్నాను. కానీ సినిమా చూశాక ఎంతో గర్వంగా అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు కంటతడి ఆగలేదు. ఎన్నో సీన్లలో గుండె తడి అవుతుంది. ఎన్నో సన్నివేశాల్లో మనకు ఏడుపొస్తుంది. అమీర్ ఖాన్ ఎంతో చక్కగా ఈ పాత్రను పోషించారు.

ఒక వేళ ఇలాంటి పాత్రను పోషించే అవకాశం నాకొస్తే నేను పోషించలేను. అందులోనూ అమీర్ ఖాన్ ఓ పాత్రను చేశాక.. మళ్లీ నేను చేయలేను. లాల్ సింగ్ చడ్డా లాంటి సినిమాను నేను చేయను. చేయలేను. నేను ఎప్పుడు కూడా జనరంజక చిత్రాలు, జనాలు నా నుంచి ఏం ఆశిస్తుంటారో అవే చేస్తాను. నన్ను ఎలా చూడాలనుకుంటారో అలాంటి సినిమాలే చేస్తాను. అమీర్ ఖాన్‌లా ప్రయోగాలు చేయలేను. ఆయన ప్రయోగాలు చేసి, అందరి చేత ఒప్పించి, మెప్పిస్తుంటారు’ అని చిరంజీవి అన్నాడు.

Liger: డిజిటల్, శాటిలైట్ రైట్స్.. లైగర్ పవర్ మామూలుగా లేదుగా..?