Chiranjeevi : సాయి పల్లవిని మెగాస్టార్ మామూలుగా ఏడిపించలేదుగా..!

‘లవ్ స్టోరీ’ మూవీ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి, సాయి పల్లవిని ఆటపట్టించారు..

Chiranjeevi : సాయి పల్లవిని మెగాస్టార్ మామూలుగా ఏడిపించలేదుగా..!

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ అదరగొట్టేశారు. ముఖ్యంగా ఆమీర్ ఖాన్‌కి, నిర్మాతలకు, నాగ చైతన్య, సాయి పల్లవి అందరికీ విషెస్ తెలుపుతూ సాగిన చిరు స్పీచ్.. సాయి పల్లవి దగ్గర కాసేపు ఆగిపోయింది.

Love Story Trailer : ‘చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం’.. చైతు బెస్ట్ పెర్ఫార్మెన్స్..

‘‘సాయి పల్లవిని ఫిదా సినిమాలో చూసే దాకా ఆమె ఎవరో తెలియదు. ఫిదాలో సాయి పల్లవి టైమింగ్, డాన్స్ టాలెంట్, ఎనర్జీ చూసి ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోయాను. వరుణ్ వచ్చి ఎలా చేశాను డాడీ అని అడిగితే, సారీరా నేను నిన్ను చూడలేదు, సాయి పల్లవిని చూశాను అని చెప్పాను. నా సినిమాలో సాయి పల్లవి సోదరి క్యారెక్టర్ చేయాల్సింది. కానీ ఆమె నో చెప్పింది, నాక్కూడా సాయి పల్లవితో బ్రదర్ క్యారెక్టర్‌లో నటించాలని లేదు. ఆమె లాంటి వండర్ ఫుల్ డాన్సర్‌తో హీరోగా డ్యాన్సులు చేయాలని ఉంది. నాతో అప్పట్లో రాధ, శ్రీదేవి పోటాపోటీగా డాన్సులు చేసేవారు. వాళ్లతో డాన్స్ చేస్తుంటే ఛాలెజింగ్ గా ఉండేది. చైతూ కూడా సాయి పల్లవితో డాన్స్ చేసేప్పుడు ఇబ్బంది పడే ఉంటాడు. మీ ఇద్దరి కాంబినేషన్ విజువల్ ఫీస్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ ప్రశంసించారు.

నాతో సినిమా అంటే నో చెప్పింది..
చిరంజీవి – మెహర్ రమేష్ కాంబోలో తమిళ్ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెల్లెలి క్యారెక్టర్ కోసం సాయి పల్లవిని అనుకున్నాం. కానీ తను ఒప్పుకోలేదు. నో చెప్పడమే మంచిదనుకున్నాను. ఎందుకంటే తన పక్కన డ్యూయెట్ చేస్తే బాగుంటుంది కానీ ‘ఏమ్మా చల్లెమ్మా’ అంటే ఏం బాగుంటుంది.. మనం కలిసి ఓ రొమాంటిక్ మూవీ చేద్దాం.. అంటూ చమత్కరించారు.

Prema Nagar : తాత సినిమాతో మనవడి మూవీకి లింక్ భలే కుదిరిందే..

సార్.. నేనలా చెప్పలేదు సార్..
ఇక సాయి పల్లవి మైక్ తీసుకుని ‘సార్ మీరంటున్నట్లు నేనేం సినిమా చెయ్యననలేదు సార్.. రీమేక్స్ చెయ్యడం ఇష్టం లేకే అలా అన్నాను. మీతో నటించాలనేది నా డ్రీమ్.. ప్లీజ్ మీ నెక్ట్స్ మూవీలో నాకు ఛాన్స్ ఇవ్వండి’ అంటూ రిక్వెస్ట్ చేసింది. చిరు, సాయి పల్లవి గురించి మాట్లాడుతున్నంత సేపు ఈవెంట్‌లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు..