Sampath Nandi : సీటీమార్ డైరెక్టర్‌తో మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి.. మాస్ ఎంటర్‌టైనర్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుని.. రీసెంట్‌గా ‘సీటీమార్’ సినిమాతో సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ సంపత్ నందితో మూవీ చెయ్యబోతున్నారు..

Sampath Nandi : సీటీమార్ డైరెక్టర్‌తో మెగాస్టార్..!

Sampath Nandi

Sampath Nandi: మాచో హీరో గోపిచంద్, తమన్నా జంటగా.. సంపత్ నంది డైరెక్ట్ చేసిన స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్ మూవీ ‘సీటీమార్’ రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతూ.. వినాయక చవితి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్లతో పాటు గోపిచంద్‌కి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది.

Seetimaar : నా ఫ్రెండ్ సినిమా బ్లాక్‌బస్టర్..

‘సీటీమార్’ ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, సంపత్ నంది మంచి కథకుడు.. ‘రచ్చ’ కథ తను నేరేట్ చేసిన విధానానికి ఫిదా అయిపోయానని చెప్పారు. కట్ చేస్తే త్వరలో సంపత్ నంది దర్శకత్వంలో చిరు ఓ సినిమా చెయ్యబోతున్నారనే వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.

Seetimaarr : సౌత్ కా సత్తా మార్ కే నయ్.. ‘సీటీ మార్’ కే దిఖాయేంగే..

వరుణ్ సందేష్ ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయిన సంపత్.. రెండో సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రచ్చ’ హిట్ అయ్యింది. తర్వాత ‘బెంగాల్ టైగర్’, ‘గౌతమ్ నంద’ సినిమాలతోనూ ఆకట్టుకున్నారు. సంపత్ రైటింగ్ స్టైల్, మేకింగ్ స్టైల్ నచ్చి మంచి కథ రెడీ చెయ్యమని చెప్పారట చిరు.

RC 15 : పోస్టర్ అంత కాస్టా.. శంకర్ సినిమా అంటే అంతే మరి..!

‘సీటీమార్’ కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ కావడంతో డబుల్ ఆనందంలో ఉన్న సంపత్ నంది, చిరు సినిమా చేద్దాం అనే మాట చెప్పగానే గాల్లో తేలిపోతున్నాడట. మెగాస్టార్ ఫ్యాన్ అయిన సంపత్.. ‘రచ్చ’ ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ.. ‘ఇప్పటినుంచి మా ఇంట్లో దేవుడి పటాల పక్కన చిరంజీవి గారి ఫొటో ఉంటుంది’.. అని చెప్పి తన అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. మరి అలాంటిది, అభిమాన హీరోతో సినిమా చేసే అవకాశం వస్తే ఆ ఆనందానికి అవధులుండవ్ కదా..