మెగాస్టార్ మెస్మరైజింగ్ లుక్! ‘ఆహా’ అంటున్న ఫ్యాన్స్..

  • Published By: sekhar ,Published On : November 19, 2020 / 12:55 PM IST
మెగాస్టార్ మెస్మరైజింగ్ లుక్!  ‘ఆహా’ అంటున్న ఫ్యాన్స్..

Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ స్పాట్‌లో అడుగుపెట్టారు. ‘ఆచార్య’ సినిమా సెట్లో కాదండోయ్.. పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సమంతతో ఇటీవల ‘సామ్ జామ్’ పేరిట ఓ స్పెషల్ టాక్ షోను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సామ్ పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయబోతుంది.


ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ షో లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన లొకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ‘సామ్ జామ్’ షూటింగ్ జరుగుతోంది.
చిరు స్టైలిష్ లుక్‌లో అదిరిపోయారు. ఆయనతో పాటు మెగా డాటర్ సుస్మిత కొణిదెల కూడా అటెండ్ అయ్యారు.



https://10tv.in/salman-khan-isolates-for-14-days-due-to-this-will-be-able-to-shoot-bigg-boss-14/
క్రీమ్ కలర్ ప్యాంటు, వైట్ టీ షర్ట్, గ్రే కలర్ బ్లేజర్, గాగుల్స్‌తో చిరు నడుచుకుంటూ వస్తున్న పిక్స్ చూస్తే ఫ్యాన్స్ విజిల్స్ వేయాల్సిందే. చిరు ఈ ఇంటర్వూలో ఎలా సందడి చేయనున్నారనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Image

Image

Image