#42YearsForMegaLegacy : ఆగస్టు 22, సెప్టెంబర్ 22 నా జీవితంలో మర్చిపోలేని రోజులు..

  • Published By: sekhar ,Published On : September 22, 2020 / 12:27 PM IST
#42YearsForMegaLegacy : ఆగస్టు 22, సెప్టెంబర్ 22 నా జీవితంలో మర్చిపోలేని రోజులు..

#42YearsForMegaLegacy: ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి మెగాస్టార్‌గా ఎదిగి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. ఆయన నటించిన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ చిత్రం 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. తన జీవితంలో సెప్టెంబర్ 22కు చాలా ప్రాధాన్యం ఉందంటూ చిరంజీవి సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ చేశారు. Pranam Khareedu‘‘నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యం ఉందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. ఆగస్ట్ 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే.. సెప్టెంబర్ 22 నటుడిగా ‘ప్రాణం (ఖరీదు)’ పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన అభిమానులకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.


చిరు సినీ రంగ ప్రవేశం చేసి నేటితో 42 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.