మెగాస్టార్ మనవరాలా.. మజాకా!.. చిరుని సర్‌ప్రైజ్ చేసిన సంహిత..

  • Published By: sekhar ,Published On : October 8, 2020 / 07:34 PM IST
మెగాస్టార్ మనవరాలా.. మజాకా!.. చిరుని సర్‌ప్రైజ్ చేసిన సంహిత..

Chiranjeevi Granddaughter Samhita: మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్, రేర్ పిక్స్ పోస్ట్ చేస్తూ మెగాఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్ ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా చిరు షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

చిరు పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కుమార్తె సంహిత రుద్రమదేవి డైలాగ్ చెప్పిన వీడియో చిరు షేర్ చేశారు. చక్కటి హావభావాలతో, ముద్దుముద్దుగా సంహిత చెప్పిన డైలాగ్ విని చిరు సర్‌ప్రైజ్ అయ్యారు. సంహిత వీడియో చూసి ‘మెగాస్టార్ మనవరాలా.. మజాకా..’ అంటూ మెగాభిమానులు కామెంట్ చేస్తున్నారు.

‘‘1990 లో సుష్మిత .. 2020 లో సంహిత పరంపర కొనసాగుతోంది #LikeMotherLikeDaughter #YoungRudrama’’ అంటూ చిరు ఆనందం వ్యక్తం చేశారు. సంహిత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/tv/CGFN2xpj1AC/?utm_source=ig_web_copy_link