Chiranjeevi: రౌడీ హీరోకు చెక్ పెట్టిన మెగాస్టార్..?

లైగర్ తర్వాత రెండు సినిమాలను లైన్ లో పెట్టిన రౌడీబాయ్.. తన నాలుగో పాన్ ఇండియా సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు.

Chiranjeevi: రౌడీ హీరోకు చెక్ పెట్టిన మెగాస్టార్..?

Sukumar Chiranjeevi

Chiranjeevi: లైగర్ తర్వాత రెండు సినిమాలను లైన్ లో పెట్టిన రౌడీబాయ్.. తన నాలుగో పాన్ ఇండియా సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ తో ఎప్పుడెప్పుడు పట్టాలెక్కాలా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. కానీ విజయ్ దేవరకొండను కాస్త పక్కకెళ్లమ్మా అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. నేను ఆల్రెడీ లైన్ లో ఉన్నాననంటున్నారు. ఇంతకీ విజయ్ చేయాలనుకున్నది ఎవరితో.. మధ్యలో చిరూ ఎందుకు ఎంటరైనట్టు?

Chiranjeevi: చిరుతో సాయి ధరమ్ మల్టీస్టారర్.. తనయుడిగా మేనల్లుడు?

విజయ్ దేవరకొండకు చెక్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. తన లైనప్ లిస్ట్ నుంచి ఓ డైరెక్టర్ ని చిరూ లాక్కున్నారు. నిజానికి పూరీ జగన్నాథ్ తో లైగర్, జనగణమన.. శివ నిర్వాణతో ఖుషీ తర్వాత సుకుమార్ తో రౌడీబాయ్ పట్టాలెక్కాల్సి ఉంది. కానీ టాలీవుడ్ అర్జున్ రెడ్డికి సుకుమార్ హ్యాండిస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప 2 తర్వాత చిరూ హీరోగా సుకుమార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది.

Chiranjeevi: చిరంజీవి సినిమాలో పూరీ జగన్నాధ్!

సుకుమార్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ తర్వాత రామ్ చరణ్ కూడా ఉన్నారు. బట్ ఇప్పుడా లైన్ లోకి చిరూ ఎంట్రీ ఇవ్వడంతో రామ్ చరణ్ సినిమాపై ఎఫెక్ట్ పడనుంది. అయినా చరణ్ కూడా వరుస ప్రాజెక్టులను సెట్ చేసుకున్నాడు. ఇప్పట్లో సుకుమార్ కి దొరకకపోవచ్చు. సో ముందు తన తండ్రి సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్నారంటే హ్యాపీగానే ఫీలవుతారు. ఎటొచ్చి ఇక్కడ దెబ్బ పడేది రౌడీబాయ్ కే.

Chiranjeevi: టార్గెట్ ఆగస్ట్ అంటోన్న గాడ్‌ఫాదర్..?

ఆచార్య తర్వాత చిరూ చేతిలో మూడు సినిమాలున్నాయి. గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేర్ వీరయ్య సినిమాల బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ లతో చిరూ ఫుల్ బిజీ ఇప్పుడు. ఈమధ్యే వెంకీ కుడుముల, డివీవి దానయ్య కాంబోలో కూడా ఓ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేశారు. కానీ సుకుమార్ చిరూ ట్రాక్ లోకి వస్తే వెంకీ కుడుముల సైడ్ అవ్వక తప్పదు. సుక్కూ మూవీ తర్వాతే వెంకీకి ఛాన్స్ ఇస్తారు మెగాస్టార్. అటు చిరంజీవి కారణంగా విజయ్ దేవరకొండ.. ఇటు సుకుమార్ కారణంగా వెంకీ కుడుముల ఇంకొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.