Chiranjeevi : మెగాస్టార్ వరల్డ్ రికార్డ్.. అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక తెలుగు సినిమా ఇదే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ఫ్యాక్షన్‌ మూవీ ‘ఇంద్ర’. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బి గోపాల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2002లో జూలై 24న విడుదలైంది.

Chiranjeevi : మెగాస్టార్ వరల్డ్ రికార్డ్.. అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక తెలుగు సినిమా ఇదే..

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ఫ్యాక్షన్‌ మూవీ ‘ఇంద్ర’. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బి గోపాల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2002లో జూలై 24న విడుదలైంది. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్‌, సోనాలి బింద్రె కథానాయికలుగా నటించారు. ఈ మూవీ వచ్చి 18 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ ఈ సినిమా గురించి చర్చించుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో చిరంజీవి ఇంద్రసేనా రెడ్డిగా చెప్పే పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ ఇప్పటికి ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంటాయి. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వినిదత్‌ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లోనే రూ. 35 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం నిజంగా పెద్ద విశేషం.

అప్పట్లోనే ఈ మూవీ రాష్ట్రంలోనే అత్యధిక సెంటర్ లలో విడుదలై 100 రోజులకు పైగా ఆడి రికార్డుల మోత మోగించింది. అలా ఫ్యాక్షన్‌ మూవీ ఇంద్ర ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది. అంతటి ఘన విజయం సాధించిన ఈ మూవీ మరో రికార్డు కూడా సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన ఏకైక తెలుగు సినిమాగా ఇంద్ర ఘనత సాధించింది. ఈ మూవీ టికెట్లు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు పైగా అమ్ముడవడం విశేషం. మరి.. మెగాస్టారా, మజాకా అని ఫ్యాన్స్ అంటున్నారు.