మెగా న్యూ లుక్.. సర్‌ప్రైజ్ అవుతున్న ఫ్యాన్స్..

  • Published By: sekhar ,Published On : July 23, 2020 / 03:54 PM IST
మెగా న్యూ లుక్.. సర్‌ప్రైజ్ అవుతున్న ఫ్యాన్స్..

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ నుండి స్పీడ్ పెంచారు. ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా’ విజయాలతో మాంచి జోరుమీదున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో చిరు ఇంట్లోనే ఉంటున్నారు. సినిమాలతో కాలక్షేపం చేస్తున్నారు. Megastar Chiranjeeviఇటీవలే ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చూసి హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపి గణేష్‌లను ఇంటికి పిలిచి అభినందించారు. ఇదిలా ఉంటే చిరు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఓ ఫోటో షేర్ చేశారు. పూర్తి మేకోవర్‌తో సరికొత్త లుక్‌లో అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు చిరు. స్లిమ్‌గా మారి మీసం లేకుండా ఉన్న పిక్‌ను ‘‘మేకోవర్ మూడ్స్’’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో చిరు పిక్ వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CC-DT1hjZmR/?utm_source=ig_web_copy_link