Chiranjeevi : చరణ్‌కి ఇలా బర్త్‌డే విషెస్ చెప్పడం వింతగా ఉంది

మెగాస్టార్ చిరంజీవి కూడా చరణ్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. చరణ్ ని చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటో, ఇటీవల ఆచార్య సినిమాలో ఇద్దరు కలిసి ఉన్న స్టిల్ కలిపి ఓ ఫోటోగా........

Chiranjeevi : చరణ్‌కి ఇలా బర్త్‌డే విషెస్ చెప్పడం వింతగా ఉంది

Charan

 

Ram Charan :  ఈ రోజు మార్చి 27న మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజు. మెగా అభిమానులకి పండగ రోజు. ఇప్పటికే చాలా మంది అభిమానులు, సెలబ్రిటీలు తమ స్టైల్ లో చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగా అభిమానులు రామ్ చరణ్ బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రామ్ చరణ్ అభిమానులు ఆయన పుట్టిన రోజు వేడుకల్ని శిల్ప కళా వేదికలో గ్రాండ్ గా చేయనున్నారు. ఇటీవలే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రిలీజ్ అయి మంచి కలెక్షన్లు సాధిస్తూ ఈ పుట్టిన రోజుని చెర్రీకి మరింత స్పెషల్ గా చేసింది.

RRR : ‘బాహుబలి’ హిస్టరీ.. ‘ఆర్ఆర్ఆర్’ హిస్టారికల్.. ఆర్జీవీ కామెంట్స్..

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా చరణ్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. చరణ్ ని చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటో, ఇటీవల ఆచార్య సినిమాలో ఇద్దరు కలిసి ఉన్న స్టిల్ కలిపి ఓ ఫోటోగా షేర్ చేస్తూ.. ”సోషల్ మీడియా ద్వారా చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు వింతగా అనిపిస్తోంది. అయితే ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ పిక్‌ ఒకటి షేర్‌ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా నన్ను చరణ్ గర్వపడేలా చేశాడు. అతడే నా గౌరవం. హ్యాపీ బర్త్ డే చరణ్” అంటూ ట్వీట్ చేశారు. ఇక చరణ్ చిన్నప్పటి ఫోటో షేర్ చేయడంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.