మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

  • Published By: vamsi ,Published On : November 9, 2020 / 11:02 AM IST
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. రిజల్ట్ పాజిటివ్ వచ్చింది అని, నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని, వెంటనే హోమ్ క్వారంటైన్‌కు వెళ్లినట్లుగా చిరంజీవి ట్విట్టర్ ద్వారా విషయాన్ని వెల్లడించారు. నాలుగైదు రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. అంటూ చిరంజీవి ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు.



ఇటీవలే నవంబర్ 7వ తేదీన చిరంజీవి, నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కూడా కలిశారు.అయితే ఆచార్య సినిమా షూటింగ్ మొదలు పెట్టే సమయంలోనే ఇలా జరగడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇటీవలే చిరంజీవి తమ్ముడు నాగబాబుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తర్వాత కోలుకున్నారు.



https://10tv.in/mega-star-chiranjeevi-condolence-message-over-the-demise-of-kuchipudi-artist-shobha-naidu/
అంతుకుముందు ప్లాస్మా చికిత్స అవగాహన సదస్సులో చిరంజీవి మాట్లాడుతూ.. ’మా ఇంట్లో పనిచేసే వంట మనిషి శ్రీను, కూరగాయలు తరిమే మహిళ, వంట మనిషి కొడుకు, స్విమ్మింగ్ పూల్ కడిగే లక్ష్మణ్ కరోనా బారిన పడ్డారని చెప్పారు. అప్పుడు వాళ్లను వెంటనే క్వారంటైన్‌కు పంపించి చికిత్స అందించామని, వాళ్ళు కోలుకున్నారని, రెండు సార్లు నెగిటివ్ వచ్చిన తర్వాత వచ్చి మళ్లీ మా ఇంట్లోనే పని చేస్తున్నారని చెప్పారు. కాగా.. ఇప్పుడు చిరంజీవికి కరోనా వచ్చింది.