Megha Akash: రేపు రిలీజ్ అవ్వాల్సిన సినిమా.. చివరి నిమిషంలో షాకిచ్చిన చిత్ర యూనిట్!

టాలీవుడ్‌లో ‘లై’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మేఘా ఆకాష్, ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. అయితే అమ్మడికి అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రాలేదని చెప్పాలి. కానీ సినిమా ఛాన్సులు మాత్రం ఈ బ్యూటీకి ఎప్పుడూ ఆగలేదు. తాజాగా మేఘా ఆకాష్ నటించిన ‘ప్రేమదేశం’ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Megha Akash: రేపు రిలీజ్ అవ్వాల్సిన సినిమా.. చివరి నిమిషంలో షాకిచ్చిన చిత్ర యూనిట్!

Megha Akash Premadesham Movie Gets Postponed By Week

Megha Akash: టాలీవుడ్‌లో ‘లై’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మేఘా ఆకాష్, ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. అయితే అమ్మడికి అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రాలేదని చెప్పాలి. కానీ సినిమా ఛాన్సులు మాత్రం ఈ బ్యూటీకి ఎప్పుడూ ఆగలేదు. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. తాజాగా మేఘా ఆకాష్ నటించిన ‘ప్రేమదేశం’ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Megha Akash: జీన్స్ వేర్‌లో మేఘా ఆకాష్ పోజులు..

శ్రీకాంత్ సిద్ధం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మేఘా ఆకాష్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో త్రిగున్, మధూ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 2న ఈ సినిమాను మంచి బజ్ మధ్య రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

Megha Akash: జస్ట్ గ్యాప్ ఇచ్చా.. ఇకపై ప్రయోగాలతో వస్తా!

అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌ను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక డిసెంబర్ 9న ఈ సినిమాను థియేటరల్లో రిలీజ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. కాగా, అదే రోజున మేఘా ఆకాష్ నటించిన మరో మూవీ ‘గుర్తుందా శీతాకాలం’ కూడా రిలీజ్ కానుంది. దీంతో డిసెంబర్ 9న మేఘా ఆకాష్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఖాయమని పలువురు కామెంట్ చేస్తున్నారు.