Mehar Ramesh : చిరంజీవి, చరణ్ కలిసి చేసిన డ్యాన్స్ చూస్తుంటే శివుడు, కుమార స్వామితో కలిసి నాట్యం చేసినట్టు ఉంది

ఈవెంట్ లో మెహర్ రమేష్ మాట్లాడుతూ.. ''చిరంజీవి గారి సినిమా రిలీజ్ అంటే పండగే. కొరటాల శివ గారు తండ్రి కొడుకులిద్దర్నీ కలిపి పెద్ద పండుగ చేశారు. టెక్నీషియన్స్ అందరూ..........

Mehar Ramesh : చిరంజీవి, చరణ్ కలిసి చేసిన డ్యాన్స్ చూస్తుంటే శివుడు, కుమార స్వామితో కలిసి నాట్యం చేసినట్టు ఉంది

Mehar Ramesh

Mehar Ramesh :  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా తరలి వచ్చారు.

 

ఈ ఈవెంట్ లో మెహర్ రమేష్ మాట్లాడుతూ.. ”చిరంజీవి గారి సినిమా రిలీజ్ అంటే పండగే. కొరటాల శివ గారు తండ్రి కొడుకులిద్దర్నీ కలిపి పెద్ద పండుగ చేశారు. టెక్నీషియన్స్ అందరూ హై స్టాండర్డ్ గా వర్క్ చేశారు. ఈ సినిమా ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్స్ చూపించారు కొరటాల శివ గారు. ఇప్పటి వరకు చిరంజీవి గారు చేయని యాక్షన్ సీన్స్ ఇందులో ఉన్నాయి. భలే భలే బంజారా సాంగ్ చూస్తుంటే శివుడు, కుమార స్వామితో కలిసి నాట్యం చేసినట్టు అనిపించింది. మీ లాగే నేను కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. నా ఫ్రెండ్, నా ఫేవరేట్ రైటర్ కొరటాల శివకి అల్ ది బెస్ట్” అని తెలిపారు.

Ram-Lakshman : ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉన్నారు

ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.