Mehar Ramesh : పూరి గారి పోకిరి.. ఇప్పుడు ఆయన శిష్యుడు సర్కారు వారి పాట.. | Mehar Ramesh Speech in Sarkaru Vaari Paata Pre Release Event

Mehar Ramesh : పూరి గారి పోకిరి.. ఇప్పుడు ఆయన శిష్యుడు సర్కారు వారి పాట..

ఈ ఈవెంట్ లో మెహర్ రమేష్ మాట్లాడుతూ..డైరెక్టర్ పరుశురాం పూరి జగన్నాధ్ దగ్గర పని చేశాడు. పూరి గారి కజిన్. ఆయన తర్వాత నేను పూరి గారి దగ్గర పని చేశాను. మహేష్ ని ఇప్పటివరకు పూరి గారే పోకిరి........

Mehar Ramesh : పూరి గారి పోకిరి.. ఇప్పుడు ఆయన శిష్యుడు సర్కారు వారి పాట..

Sarkaru Vaari Paata  :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

Buchhibabu Sana : మహేష్ గారిని చూశాకే అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని తెలుసుకున్నా

ఈ ఈవెంట్ లో మెహర్ రమేష్ మాట్లాడుతూ..డైరెక్టర్ పరుశురాం పూరి జగన్నాధ్ దగ్గర పని చేశాడు. పూరి గారి కజిన్. ఆయన తర్వాత నేను పూరి గారి దగ్గర పని చేశాను. మహేష్ ని ఇప్పటివరకు పూరి గారే పోకిరి సినిమాతో అభిమానులకి ఎలా చూపించాలో అలా చూపించారు. ఇప్పుడు ఆయన దగ్గర పని చేసిన పరశురామ్ మహేష్ గారిని మళ్ళీ అదే రేంజ్ లో చూపిస్తున్నారు. కీర్తిలో మాస్ యాంగిల్ తీసుకొచ్చాడు డైరెక్టర్. మహేష్ గారి అందం, స్టైల్ గురించి చెప్పవసరంలేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.

×