Mehreen Przada : నడిరోడ్డు మీద స్టెప్పులేసిన మెహ్రీన్..

తాజాగా మెహ్రీన్ ఓ డ్యాన్స్ వీడియో షేర్ చేసింది. అయితే డ్యాన్స్ వీడియోలో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? ఆ డ్యాన్స్ నడి రోడ్డు మీద చేసింది. ఇటీవల తన బంధువుల పెళ్లి వేడుకల్లో.............

Mehreen Przada : నడిరోడ్డు మీద స్టెప్పులేసిన మెహ్రీన్..
ad

Mehreen Przada :  కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ్, పంజాబీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవలే హనీ ఈజ్ రిచ్ అంటూ F3 సినిమాతో ప్రేక్షకులని అలరించింది. ఇక మెహ్రీన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. వరుసగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకి నిత్యం టచ్ లో ఉంటుంది.

తాజాగా మెహ్రీన్ ఓ డ్యాన్స్ వీడియో షేర్ చేసింది. అయితే డ్యాన్స్ వీడియోలో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? ఆ డ్యాన్స్ నడి రోడ్డు మీద చేసింది. ఇటీవల తన బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గోంది హీరోయిన్‌ మెహ్రీన్. ఈ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో నిర్వహించిన ఊరేగింపులో భాగంగా నడిరోడ్డుపై స్టెప్పులేసింది. మరో అమ్మాయితో కలిసి తీన్‌మార్ స్టెప్పులేసింది మెహ్రీన్. ఇలా పెళ్లి ఊరేగింపులో నడిరోడ్డుమీద డ్యాన్స్ చేసిన వీడియోని మెహ్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Nagasaurya : హీరో నాగశౌర్య సోదరుడు గౌతమ్ పెళ్లి వేడుకలు..

ఈ వీడియోకి ‘పంజాబీ వెడ్డింగ్‌ సీన్స్‌’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మెహ్రీన్ ఇలాంటి వీడియో పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెహ్రీన్ డ్యాన్స్ చుసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.