బాలీవుడ్ ను వణికిస్తున్న కరోనా, మరో ప్రముఖ నిర్మాత ఇంట్లో కొవిడ్ కేసులు నమోదు

కరోనా వైరస్ మహమ్మారి బాలీవుడ్ ను వణికిస్తోంది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లలో కరోనా

  • Published By: naveen ,Published On : May 26, 2020 / 11:11 AM IST
బాలీవుడ్ ను వణికిస్తున్న కరోనా, మరో ప్రముఖ నిర్మాత ఇంట్లో కొవిడ్ కేసులు నమోదు

కరోనా వైరస్ మహమ్మారి బాలీవుడ్ ను వణికిస్తోంది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లలో కరోనా

కరోనా వైరస్ మహమ్మారి బాలీవుడ్ ను వణికిస్తోంది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ప్రముఖ నిర్మాత కరీం మోరానీ, బోనికపూర్ ఇంట్లో కరోనా కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శక, నిర్మాత కరణ్ జోహర్ ఇంట్లోనూ కరోనా కలకలం రేపింది. 

ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. సోమవారం(మే 25,2020) రాత్రి ఆయన ఈ మేరకు తన సోషల్ మీడియా పేజ్‌లో  ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆందోళన పడొద్దు, నేను క్షేమంగానే ఉన్నా:
”నా ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్థారణ అయ్యింది. వారిలో లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వెంటనే మా బిల్డింగ్‌లోనే వారిని క్వారెంటైన్‌లో ఉంచాము. బీఎంసీకి తెలియజేశాము. బిల్డింగ్ మొత్తాన్నినింబంధనలకు అనుగుణంగా శుభ్రపరిచాము. ఇంట్లో ఉంటున్న మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవు. మా కుటుంబ సభ్యులతో పాటు స్టాఫ్ అంతా సురక్షితంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం అందరం స్వాబ్‌ టెస్ట్ చేయించుకున్నాం. అందరికీ నెగెటివ్‌ వచ్చింది. అయినా 14 రోజుల పాటు క్వారెంటైన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. అందరి రక్షణ కోసం మేం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం” అని కరణ్‌ జోహార్ తెలిపాడు. ఆ ఇంట్లో కరణ్‌ జోహార్ తో పాటు ఆయన తల్లి హిరూ, పిల్లలు యష్‌, రూహిలు ఉంటున్నారు.

దేశంలో ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కష్ట సమయాల్లో ఎదురయ్యే పరీక్షలను సానుకూలంగా అధిగమించాలి. ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా. కరోనాను మనం తరిమి కొడతామనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు ఇంటి పట్టునే ఉంటూ సురక్షితంగా ఉండండి అంటూ కరణ్ తన ట్విట్టర్‌లో రిక్వెస్ట్ చేశాడు.

మొన్న కరీం మొరానీ, నిన్న బోనీకపూర్, నేడు కరణ్ జోహర్:
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సినీ రంగాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పటికే షూటింగ్‌లు, సినిమా రిలీజ్‌ లు ఆగిపోయాయి. వేల కోట్ల రూపాయల నష్టాలు చవిచూశారు. ఇది చాలదన్నట్టు ప్రముఖల ఇళ్లలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం రేపుతోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాత కరీం మొరానీతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లకు పాజిటివ్‌ అని తేలటంతో ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం మొదలైంది. తర్వాత గాయని కనికా కపూర్‌ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవలే బాలీవుడ్‌ బడా ప్రొడ్యూసర్‌ బోనీ కపూర్‌ ఇంట్లో కరోనా కేసులు నమోదైన సంగతి తెలసిందే. బోని ఇంట్లో ముగ్గురు పని వారికి కరోనా సోకినట్టుగా నిర్థారణ అయ్యింది. ఇప్పుడు కరణ్ జోహర్ ఇంట్లోనూ కరోనా కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది.

మహారాష్ట్రలో 52వేల 667, ముంబైలో 31వేల 972 కరోనా కేసులు:
దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ 50వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ పెద్ద సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32వేలుగా ఉంది. ఒక్క ముంబైలోనే కరోనాతో వెయ్యిమందికిపైగా మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నా మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చెయ్యలేకపోతున్నారు.

Read:  సల్మాన్ ఖాన్.. పర్సనల్ కేర్ బ్రాండ్ ఇదే.. శానిటైజర్లతోనే బిగిన్!