Memu Famous Unit : కొందరు కావాలనే మా సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.. మా సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు..

తాజాగా మేము ఫేమస్ చిత్రయూనిట్ ప్రెస్ మీట్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈ సినిమా బాగున్నా, మంచి రెస్పాన్స్ వస్తున్నా కొంతమంది మాత్రం కావాలని సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. దీనిపై మేము ఫేమస్ హీరో, నిర్మాతలు ఈ ప్రెస్ మీట్ లో స్పందించారు.

Memu Famous Unit : కొందరు కావాలనే మా సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.. మా సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు..

Memu famous hero sumanth prabhas and producer sarath reacts about negativity on their movie

Sumanth Prabhas :  యూట్యూబ్(Youtube) లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన సుమంత్ ప్రభాస్(Sumanth Prabhas) హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా మేము ఫేమస్(Memu Famous). చాయ్ బిస్కెట్ నిర్మాణంలో దాదాపు 30 మంది కొత్త నటీనటులతో ఈ సినిమా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కింది. చిన్న సినిమా అయినా ప్రమోషన్స్ మాత్రం భారీగా, డిఫరెంట్ గా చేశారు. సినిమా రిలీజ్ కి ముందు నుంచి దీనిపై అంచనాలు నెలకొన్నాయి. స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా కోసం ప్రమోషన్స్ చేశారు. సినిమా చూసి మహేష్ బాబు, రాజమౌళి లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా అభినందిస్తున్నారు. ఇటీవల మే 26న మేము ఫేమస్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి సందడి చేస్తుంది. మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక కలెక్షన్స్ మూడు రోజుల్లో 3.1 కోట్ల గ్రాస్ సాధించింది.

తాజాగా మేము ఫేమస్ చిత్రయూనిట్ ప్రెస్ మీట్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈ సినిమా బాగున్నా, మంచి రెస్పాన్స్ వస్తున్నా కొంతమంది మాత్రం కావాలని సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. దీనిపై మేము ఫేమస్ హీరో, నిర్మాతలు ఈ ప్రెస్ మీట్ లో స్పందించారు.

మేము ఫేమస్ హీరో, దర్శకుడు సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. చాయ్ బిస్కెట్ మాకు సినిమా అవకాశం ఇచ్చింది. కొత్త వాళ్ళని ప్రోత్సహించాలని ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ళు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేశారు. చూసిన ప్రేక్షకులు బాగుంది అన్నారు. మూడు రోజుల్లో మూడు కోట్లు ఇచ్చారు. కొత్త వాళ్ళకి మూడు రోజుల్లో మూడు కోట్లు రావడం నాకు చాలా క్రేజీగా అనిపించింది. ఐతే మధ్యలో నెగిటివిటి ని ప్రచారం చేస్తున్న వారెవరో అర్థం కావడం లేదు. కావాలనే కొందరు పనిగట్టుకుని సినిమా పై నెగిటివిటిని స్ప్రెడ్ చేస్తున్నారు. దీని వలన వాళ్లకి ఏం లాభాలో అర్ధం కావడం లేదు. కొత్తవాళ్ళని ప్రోత్సహించాలి కానీ ఇలా నెగిటివ్ చేసి వెనక్కి లాగడం సరికాదు. ఇలాంటి నెగిటివిటీని పట్టించుకోవద్దు. సినిమాకి వెళ్ళండి. మీ టికెట్ డబ్బులు ఎక్కడికీ పోవు. రెండున్నర గంటలు ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.

Memu Famous : మేము ఫేమస్ సినిమాపై.. మహేష్, రాజమౌళి ట్వీట్లు.. స్టార్ సెలబ్రిటీల ప్రమోషన్స్.. అసలు ఏముంది ఆ సినిమాలో?

ఇక సినిమా నిర్మాతల్లో ఒకరైన శరత్ మాట్లాడుతూ.. మేము చాలా కష్టపడి ఒక సినిమా చేశాం. అది బాగోకపోతే ఇక్కడ నిలబడం. కావాలనే సినిమాని తొక్కేయాలని కొందరు చూస్తున్నారు. మా జీవితంలో మేము ఏం చేయాలని అలోచించాం తప్ప పక్కొడిని ఎట్లా తొక్కేయాలని ఆలోచించలేదు. ఇది మాకే కాదు ఇండస్ట్రీలో ప్రతి నిర్మాత, దర్శకుడు, హీరో ప్రతి ఒక్కరు ఎదుర్కొని ఉంటారు. చాలాసార్లు దీని గురించి మాట్లాడాలని అనుకున్నాం. కానీ ఈ రోజు 22 ఏళ్ల పిల్లలకి ఇలా జరుగుతుంటే చాలా బాధ అనిపించి దీనిని అడ్రస్ చేస్తున్నాం. సినిమా గురించి మీకు ఏదైనా అనిపిస్తే ఒక ప్లేస్ అనుకుందాం. లైవ్ పెడదాం. క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతేగాని అసభ్యంగా మాట్లాడటం మాత్రం చేయకండి. దాని ద్వారా చాలా మంది బాధపడతారు. సోషల్ మీడియాని పాజిటివ్ గా వాడుకోవాలి. నెగిటివ్ గా వాడితే దాని వలన నష్టం తప్పితే లాభం లేదు. మీకు నచ్చకపొతే ట్విట్టర్ లో చెప్పండి. మీతో కలిసి సినిమా చూసి చర్చించుకుందాం. ఇది యూత్ సినిమా. యూత్ చాలా కనెక్ట్ అవుతున్నారు. మంచి మోటివేషన్ ఇచ్చే సినిమా కాబట్టి యూత్ చూడాలనే ఉద్దేశంతో స్టూడెంట్ అందరికీ రూ. 99 లకే టికెట్ రేటు ఉండేలా చేశాం. కౌంటర్ లో మీ ఐడీ కార్డ్ చూపిస్తే 99 లకే టికెట్ ఇస్తారు. ఈ రోజు ఉదయం నుంచే ఇది లాంచ్ అయ్యింది. థియేటర్ లిస్టు కూడా పెడతాం. మంచి ఉద్దేశంతో సినిమా చేశాం. రిజల్ట్ పట్ల చాలా ఆనందంగా వుంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉన్న ఆ ఒక్క శాతం నెగిటివిటీ కూడా మాయమైపోతుంది. సినిమాకి చాలా పెద్ద లాంగ్ రన్ ఉంటుంది అని అన్నారు. దీంతో మేము ఫేమస్ నిర్మాత, హీరో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.