#Mentoo : రియలిస్టిక్ ‘#మెన్ టూ’ సినిమా ఆహాలోకి వచ్చేస్తుంది.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..

సాధార‌ణంగా భార్య‌ల‌ను భ‌ర్త‌లు చిత్ర హింస‌లు పెట్ట‌టం అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వ‌చ్చాయి. అయితే పెళ్లి కానీ మ‌గ‌వాళ్లు ప్రేయ‌సిల చేతిలో.. పెళ్లైన వారు భార్య‌ల చేతిలో తెలియ‌ని బాధ‌ను అనుభ‌విస్తుంటార‌నే పాయింట్‌ను ఎలివేట్ చేస్తూ, మగాళ్ల సమస్యలు, బాధలపై, బయట సమాజంలో జరిగే కొన్ని నిజ సంఘటనల ఆధారంగా...

#Mentoo : రియలిస్టిక్ ‘#మెన్ టూ’ సినిమా ఆహాలోకి వచ్చేస్తుంది.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..

#MENTOO Movie streaming in AHA from June 9th

#Mentoo :  ఎప్ప‌టిక‌ప్పుడు విభిన్న‌మైన సినిమాలు, సిరీస్‌లు, షోస్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ నెంబ‌ర్ వ‌న్‌గా దూసుకెళ్తుంది తెలుగు ఓటీటీ ‘ఆహా’(Aha). అచ్చ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ప్ర‌తి శుక్ర‌వారం ఓ కొత్త ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్‌కి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటోంది. ఈ శుక్ర‌వారం (జూన్ 9) మ‌రో హిలేరియ‌స్ అండ్ రియలిస్టిక్ ఎంట‌ర్టైన‌ర్ ‘#మెన్ టూ’తో వినోదాన్ని అందించ‌టానిక ఆహా సిద్ధ‌మైంది.

నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన‌ చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మౌర్య సిద్ధ‌వ‌రం ఈ చిత్రాన్ని నిర్మించారు.

సాధార‌ణంగా భార్య‌ల‌ను భ‌ర్త‌లు చిత్ర హింస‌లు పెట్ట‌టం అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వ‌చ్చాయి. అయితే పెళ్లి కానీ మ‌గ‌వాళ్లు ప్రేయ‌సిల చేతిలో.. పెళ్లైన వారు భార్య‌ల చేతిలో తెలియ‌ని బాధ‌ను అనుభ‌విస్తుంటార‌నే పాయింట్‌ను ఎలివేట్ చేస్తూ, మగాళ్ల సమస్యలు, బాధలపై, బయట సమాజంలో జరిగే కొన్ని నిజ సంఘటనల ఆధారంగా ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ జి.రెడ్డి ‘#మెన్ టూ’ సినిమాను రూపొందించారు.

Adipurush : ‘ఆదిపురుష్’ని నైజాంలో రిలీజ్ చేసేది ఎవరో తెలుసా? చాలా మంది పోటీ పడ్డారు.. కానీ..

ఇటీవల మే 26న ‘#మెన్ టూ’ సినిమా థియేటర్స్ లోరిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలలో అలరించడానికి సిద్ధమైంది. జూన్ 9 నుంచి ఆహా ఓటీటీలో ‘#మెన్ టూ’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో మిస్ అయినా వాళ్ళు ఆహాలో చూసేయండి.