తమిళ మూవీ ‘మెర్సల్‌’ రీమేక్ లో షారుఖ్

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 10:13 AM IST
తమిళ మూవీ ‘మెర్సల్‌’ రీమేక్ లో షారుఖ్

విజయ్‌ నటించిన తమిళ చిత్రం ‘మెర్సల్‌’ భారీ విజయం అందుకొంది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట యంగ్‌ డైరెక్టర్‌ అట్లీ. కోలీవుడ్‌లో వరుస విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న అట్లీ ఇప్పుడు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో కలిసి బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. షారుఖ్ తో అట్లీ సినిమా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ రీమేక్‌ పై షారుఖ్‌ ఆసక్తి చూపడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అట్లీ తెలిపారు. 

ఈ సినిమాతో పాటుగా అట్లీ దర్శకత్వంలో మరో సినిమాలో కూడా నటించేందుకు షారుఖ్‌ ఓకే చెప్పారు. దీంతో ఇద్దరి ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. IPL సీజన్ ‌12లో చెన్నై- కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అయిన వెంటనే అట్లీ ఆఫీసుకు వెళ్లిన షారుఖ్‌ రెండు స్క్రిప్టులను ఫైనల్‌ చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

జీరో సినిమా డిజాస్టర్‌ కావడంతో నిరాశ చెందిన షారుఖ్‌ ఇంతవరకు ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. అయితే అట్లీ మీద ఉన్న నమ్మకంతో అతడికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.