Merise Merise : లవ్ అండ్ ఎమోషనల్.. ‘మెరిసే మెరిసే’ – రివ్యూ..

‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా.. ‘మెరిసే మెరిసే’..

Merise Merise : లవ్ అండ్ ఎమోషనల్.. ‘మెరిసే మెరిసే’ – రివ్యూ..

Merise Merise

Merise Merise: ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా.. ‘మెరిసే మెరిసే’.. లవ్, కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఆగస్టు 6న థియేటర్లలో విడుదల‌ైంది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

క‌థ విషయానికొస్తే…
సిద్ధు (దినేష్ తేజ్) బెంగుళూరులో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి ఫెయిల్ అవుతాడు. దీంతో నిరాశకు గురవుతాడు. బిటెక్ చ‌దివిన దినేష్.. ఆ మూడ్ నుండి బయటకొచ్చేందుకు పేరెంట్స్ సలహాతో హైదరాబాద్ షిఫ్ట్ అవుతాడు. వెన్నెల (శ్వేతా అవస్తి) ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంటుంది. లండన్‌లో డాక్టర్‌గా పని చేసే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అవుతుంది. పెళ్లికి 8 నెలలు గ్యాప్ తీసుకోవడంతో.. ఈలోగా వీసా ప‌నులు కోసం హైదరాబాద్ వచ్చి బంధువుల ఇంటిలో ఉంటుంది. కాబోయే భర్త, అత్తలకు వ్యతిరేకంగా ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో సిద్ధుతో పరిచయం ఏర్పడుతుంది. ఆ రిలేషన్ ఎక్కడి వరకు దారి తీసింది.. ఆమె ‘వసుంధర’ బ్రాండ్ ప్రారంభించడం వెనుక కారణం ఏంటి.. ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ కావడానికి రీజన్ ఏంటి? అనేది మిగతా కథ..

Merise Merise

ఆర్టిస్టులు…
‘హుషారు’, ‘ప్లేబ్యాక్’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ దినేష్ తన స్టైల్ నేచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. మంచి టాలెంట్ ఉండి, జీవితంలో సొంతగా ఎదగాలనుకుని, ఎదురుదెబ్బ తగిలిన యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్ శ్వేత చక్కటి నటనతో పాటు బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది శ్వేత. మిగతా నటీనటులు అందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు.

టెక్నిషియన్స్…
ద‌ర్శ‌కుడు విషయానికొస్తే.. తను ఏదైతే అనుకున్నాడో అది తెర మీదకు తేవడంలో సక్సెస్ అయ్యాడు. మ‌హిళ‌కు కూడా ఓ మ‌న‌సుంటుంది, త‌న కాళ్ళ‌పై తాను జీవితంలో ఎద‌గాలనే తాప‌త్ర‌య‌ పడుతుంది అనే అంశాలను చ‌క్క‌గా వివ‌రించారు. కార్తిక్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. న‌గేష్ కెమెరా ప‌నితంన సినిమాకు అందం తెచ్చింది. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Shweta Avasthi

ఓవరాల్ గా చెప్పాలి అంటే…
ప‌రిమితమైన న‌టీన‌టుల‌తో, ప‌రిమిత లొకేష‌న్ల‌లో తీసిన ఈ సినిమాలో చక్కటి ప్రేమ కథతో పాటు యువతకు ఓ మంచి మెసేజ్‌ కూడా ఇచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా మహిళలకు నచ్చే విధంగా, ఎమోషనల్‌గా డిజైన్ చేసిన హీరోయిన్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. సినిమాలో అక్క‌డ‌క్క‌డా చిన్న‌పాటి లోపాలున్నా క‌థ ప‌రంగా అవేవి క‌నిపించ‌వు.

నటీన‌టులు…
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు…

టెక్నిషియన్స్…
నిర్మాత: వెంకటేష్ కొత్తూరి, ర‌చ‌న‌, దర్శకత్వం: పవన్ కుమార్. కె, సినిమాటోగ్ర‌ఫీ: న‌గేష్ బానెల్, సంగీతం: కార్తిక్ కొడగండ్ల, ఎడిట‌ర్‌: మ‌హేష్…