Ghani: వరుణ్‌తో మిల్కీ బ్యూటీ.. మాస్ మసాలా ఐటెం నెంబర్!

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా, మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తున్న మూవీ..

Ghani: వరుణ్‌తో మిల్కీ బ్యూటీ.. మాస్ మసాలా ఐటెం నెంబర్!

Ghani

Ghani: మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా, మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తున్న మూవీ ‘గని’. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర, జగపతి బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

Boyapati-Pawan: బోయపాటితో పవర్ స్టార్.. ఇది సెట్టయ్యే కాంబినేషనేనా?

వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమా మీద ఆసక్తిని రేకెత్తించగా ఇప్పుడు ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో ఒక మాంచి మాసాలా ఐటెం సాంగ్ ఉన్నట్టుగా యూనిట్ రిలీవ్ చేసింది. ఈ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ పర్ఫామెన్స్ చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ముందు ఈ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఓపెన్ చేయలేదు.

Siddharth-Saina Nehwal: సైనాకు సిద్దార్థ్ క్షమాపణ.. వివాదం ముగిసినట్లేనా?

కానీ, బుధవారం ఉదయం 11 గంటలకు ఈ పాటలో మిల్కీబ్యూటీ తమన్నా స్టెప్పులేసినట్లు యూనిట్ అప్డేట్ ఇచ్చింది. దీంతో ఇది తమన్నా మరో మసాలా పాటగా డిసైడ్ అయింది. తమన్నా గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జైలవకుశ, కేజేఎఫ్ 1, సరిలేరు నీకెవ్వరూ సినిమాలలో ఐటెం సాంగ్స్ తో దుమ్ములేపగా ఇప్పుడు మరోసారి వరుణ్ తేజ్ తో కలిసి మాస్ స్టెప్పులేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా.. జనవరి 15న ఈ ఐటెం సాంగ్ విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది.