Boys Teaser: 3 రోజుల్లో మిలియన్ వ్యూస్.. సన్నీ హస్తవాసి మంచిదే!

ఏదైనా సినిమాను తెరకెక్కించడమే కాదు.. దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ సినిమాలో కంటెంట్ ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరు.. అది వేరే విషయం. కానీ.. ముందు అసలు తమ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మాత్రం కాస్త టెక్నీక్ తెలిసి ఉండాలి. అలాంటి కిటుకులు తెలిసిన నిర్మాత కాబట్టే మిత్రా శర్మ తన కొత్త సినిమా టీజర్ ను సన్నీలియోన్ చేతుల మీదగా విడుదల చేయించారు.

Boys Teaser: 3 రోజుల్లో మిలియన్ వ్యూస్.. సన్నీ హస్తవాసి మంచిదే!

Boys Teaser

Boys Teaser: ఏదైనా సినిమాను తెరకెక్కించడమే కాదు.. దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ సినిమాలో కంటెంట్ ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరు.. అది వేరే విషయం. కానీ.. ముందు అసలు తమ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మాత్రం కాస్త టెక్నీక్ తెలిసి ఉండాలి. అలాంటి కిటుకులు తెలిసిన నిర్మాత కాబట్టే మిత్రా శర్మ తన కొత్త సినిమా టీజర్ ను సన్నీలియోన్ చేతుల మీదగా విడుదల చేయించారు. దీంతో పేరుకు చిన్న సినిమా అయినా మూడు రోజుల్లోనే టీజర్ మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది.

యూత్ ఫుల్ టీనేజ్ అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాను మిత్రా శర్మ అనే నటి నిర్మాతగా మారి రూపొందించగా శుక్రవారం సన్నీలియోన్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ ఒకవైపు సినిమాలో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ టీజర్ విషయానికొస్తే కంప్లీట్ యూత్ ఫుల్ కాన్సప్ట్ తో నింపేయడమే ఈ రెస్పాన్స్ కారణంగా కనిపిస్తుంది. మరోవైపు సన్నీ పేరు కూడా ఈ టీజర్ రెస్పాన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ సినిమాలో మిత్రా శర్మకి జోడిగా గీతానంద్ నటిస్తుండగా దయానంద్ అనే యువకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రాజా హే రాజా అనే యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ రాగా.. ఈ పాటను శ్రీమణి రచించగా ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పాడారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.