Malla Reddy : మంత్రి మల్లారెడ్డిని ఇలా కూడా వాడేస్తున్నారా.. ఆహా సినిమా ప్రమోషన్స్ కోసం నటించిన మల్లారెడ్డి..

పలువురు సినిమా వాళ్ళు మల్లారెడ్డి కాలేజీల్లో ఇప్పటికే షూటింగ్స్, ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల మల్లారెడ్డిని సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా పిలవడం, మల్లారెడ్డి తో తమ టీజర్, ట్రైలర్స్ లాంచ్ చేయించడం చేస్తున్నారు సినిమా వాళ్ళు. దీంతో మల్లారెడ్డి వల్ల తమ సినిమా కూడా బాగా ప్రమోట్ అవుతుందని భావిస్తున్నారు.

Malla Reddy : మంత్రి మల్లారెడ్డిని ఇలా కూడా వాడేస్తున్నారా.. ఆహా సినిమా ప్రమోషన్స్ కోసం నటించిన మల్లారెడ్డి..

Minister Malla Reddy acted in Aha Video for Movie Promotions goes Viral

Malla Reddy : తెలంగాణ(Telangana) మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) ఇటీవల బాగా ఫేమస్ అయ్యారు. తన కాలేజీ ఈవెంట్స్ లో, బయట కార్యక్రమాల్లో మాట్లాడిన స్పీచ్ లతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆయన కూడా మరింత యాక్టివ్ గా ఉంటూ మైక్ కనిపిస్తే మరింత జోష్ గా మాట్లాడుతున్నారు. దీంతో మల్లారెడ్డి బాగా వైరల్ అయ్యారు, అయన స్పీచ్ లు కూడా వైరల్ అయ్యాయి. ఇటీవల కష్టపడ్డా.. సక్సెస్ అయిన.. అంటూ ఇచ్చిన స్పీచ్ బాగా వైరల్ అయింది. దీంతో ఆయన్ని ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కి కూడా వాడేస్తున్నారు.

పలువురు సినిమా వాళ్ళు మల్లారెడ్డి కాలేజీల్లో ఇప్పటికే షూటింగ్స్, ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల మల్లారెడ్డిని సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా పిలవడం, మల్లారెడ్డి తో తమ టీజర్, ట్రైలర్స్ లాంచ్ చేయించడం చేస్తున్నారు సినిమా వాళ్ళు. దీంతో మల్లారెడ్డి వల్ల తమ సినిమా కూడా బాగా ప్రమోట్ అవుతుందని భావిస్తున్నారు. గతంలో మల్లారెడ్డి డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా కుడా ఆఫర్ చేశాడని, నేనే నో చెప్పానని అన్నారు. కానీ తాజాగా ఆహా ఓటీటీ కోసం మల్లారెడ్డి నటించారు.

Kota Srinivasarao: టాలీవుడ్ హీరోల‌పై మండిప‌డ్డ కోటాశ్రీనివాస‌రావు.. ఆ వ్యాఖ్య‌లు పవన్ ను ఉద్దేశించేనా?

తెలుగు ఓటీటీ ఆహా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సత్తిగాని రెండెకరాలు అని ఓ సినిమా ఆహాలో వచ్చింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పక్కన ఉండే కేశవ క్యారెక్టర్ చేసిన జగదీశ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మల్లారెడ్డిని తీసుకొచ్చి జగదీశ్ తో ఓ ఫన్నీ వీడియో చేపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో మల్లారెడ్డి భవిష్యత్తులో సినిమాలలో నటించినా ఆశ్చర్యపోనవసరం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.