Mirzapur : మిర్జాపూర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఓటిటి ప్లాట్‌ఫార్మ్ లో పరసరమయ్యే పలు వెబ్ సిరీస్ లు సినీప్రియులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. అందులో ఒకటి 'మిర్జాపూర్' సిరీస్. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. తాజాగా మూడు సీజన్ గురించి అప్డేట్ వచ్చేసింది.

Mirzapur : మిర్జాపూర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

Mirzapur season 3 shooting completed

Mirzapur : కరోనా లాక్‌డౌన్ సమయంలో ఓటిటి ప్లాట్‌ఫార్మ్ లో పరసరమయ్యే పలు వెబ్ సిరీస్ లు సినీప్రియులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. అందులో ఒకటి ‘మిర్జాపూర్’ సిరీస్. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సిరీస్ లోని మున్నా భాయ్ క్యారెక్టర్ కి మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

Balakrishna: బాలయ్య నెక్ట్స్ మూవీ షూటింగ్ ఆరోజే ప్రారంభం..?

కరణ్ అన్షుమాన్ తెరకెక్కించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పటికే రెండు సీజన్లు వచ్చిన ఈ సిరీస్ లో మూడు సీజన్ కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మూడు సీజన్ గురించి అప్డేట్ వచ్చేసింది. మిర్జాపూర్ లో ప్రధాన పాత్ర పోషించిన ‘అలీ ఫాజాల్’ ఈ సీజన్ షూటింగ్ పూర్తీ చేసుకున్నట్లు తెలియజేశాడు.

మిగతా రెండు సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ తనకి ఎంతో ప్రత్యేకమంటూ, ఎన్నో జ్ఞాపకాలని ఇచ్చిందంటూ అలీ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ రాసుకొచ్చాడు. దీంతో అభిమానులు ఈ సీజన్ రిలీజ్ డేట్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు.