Chiranjeevi Website: మెగా వెబ్‌సైట్‌లో తప్పులు.. మినిమం జాగ్రత్త లేదా?

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవికి సంబంధించి.. ఆయన జీవితం గురించి.. ఆరంభం నుండి మెగాస్టార్ వరకు ఆయన ఎదిగిన తీరు గురించి ఆయన అభిమానులు తీలుసుకోవాలని ఉంటుంది. అలాంటి వారి కోసం ..

Chiranjeevi Website: మెగా వెబ్‌సైట్‌లో తప్పులు.. మినిమం జాగ్రత్త లేదా?

Chiranjeevi Website

Chiranjeevi Website: టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవికి సంబంధించి.. ఆయన జీవితం గురించి.. ఆరంభం నుండి మెగాస్టార్ వరకు ఆయన ఎదిగిన తీరు గురించి ఆయన అభిమానులు తీలుసుకోవాలని ఉంటుంది. అలాంటి వారి కోసం చిరంజీవి గురించి పూర్తి సమాచారాన్ని ఫోటోలతో సహా అందించాలని అనుకోవడం మంచిదే. కానీ, ఇందుకోసం ఎలాంటి కసరత్తులు చేయకుండా.. మినిమం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఓ వెబ్ సైట్ రూపొందించి వదిలారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు కానీ ప్రారంభాన్ని మాత్రం ఘనంగా నిర్వహించారు.

Telugu Films Releases: టార్గెట్ డిసెంబర్.. అందరి చూపు ఈనెలపైనే!

తాజాగా kchiranjeevi.com పేరుతో ఓ వెబ్‌సైట్‌ను, chiranjeevicharitabletrust.com పేరుతో మరో వైబ్‌సైట్‌ను చిరు తనయుడు రామ్‌చరణ్‌ ప్రారంభించాడు. చిరంజీవి పర్సనల్‌ వెబ్‌సైట్‌లో ఆయన నటించిన చిత్రాలు, ఫొటోగ్యాలరీలతో ఇలా ఆయనకు సంబంధించిన సమగ్ర సారంశాన్ని అందులో పొందుపరిచగా.. చారిటబుల్‌ ట్రస్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో సేవా కార్యక్రమాల గురించి వివరించారు. మొత్తం 25 భాషల్లో రూపొందిన ఈ వెబ్‌సైట్‌ను సోమవారం నుండి అందుబాటులోకి వచ్చింది. అయితే.. ఒక్క ఇంగ్లీష్ మినహా ఇతర బాషలలో ఏది చూసినా ఆశ్చర్యపోవడంతో అభిమానుల వంతయింది.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

ఈ వెబ్ సైట్స్ లో ఇంగ్లిష్‌ బాష ఒక్కటే డెవలపర్స్ పొందుపరచగా మిగతా భాషలన్నీ టాన్సలేషన్‌ ఆప్షన్‌ ఇచ్చారు. అయితే, ఆ ఆప్షన్‌ అప్లై చేయగానే అందులో ఉన్న సమాచారం మొత్తం అర్థరహితంగా మారిపోగా.. ఒకరకంగా అక్కడక్కడా ఇది బూతు భాషగా మారింది. ఒక్క తెలుగులోనే కాదు ఇలా మిగతా అన్ని బాషలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వెబ్‌సైట్‌లో ఇలాంటి తప్పులు దొర్లడం అంటే కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని స్పష్టంగా తెలిసిపోతుంది.

Telugu Young Directors: స్టార్ హీరోలను ఫిదా చేస్తున్న యంగ్ డైరెక్టర్స్..!

వెబ్ సైట్ ప్రారంభం కాగానే సోషల్ మీడియాలో ఘోరమైన ట్రోలింగ్స్ మొదలు కావడంతో ప్రస్తుతం ఒక్క ఇంగ్లీష్ మినహా మిగతా అన్ని బాషలను ఆపేశారు. దీనికి మార్పులు చేసి మళ్ళీ త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. అయితే.. స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చెప్పిన సందేశం మాదిరి తప్పుల తెలుగుతో కూడిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో దారుణంగా వైరల్ అవుతున్నాయి. అసభ్యకరమైన మార్గాలు అతని తేజస్సును మార్చాయని.. దురదృష్టం వారిని కంటికి రెప్పలా చూసుకుందనే మాటలు మెగా అభిమానులకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. అయితే.. ఇదంతా మినిమం జాగ్రత్త లేకపోవడం.. వెబ్ సైట్ తీసుకురావడంతో కీలకమైన వ్యక్తుల బాధ్యతలేమి మాత్రమేనని స్పష్టంగా తెలుస్తుంది.