ట్రైలర్‌కి ఇంటర్వెల్ ఏంట్రా అయ్యా- వర్మ చేతుల మీదుగా MMOF ట్రైలర్..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా MMOF ట్రైలర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : March 9, 2020 / 10:05 AM IST
ట్రైలర్‌కి ఇంటర్వెల్ ఏంట్రా అయ్యా- వర్మ చేతుల మీదుగా MMOF ట్రైలర్..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా MMOF ట్రైలర్ విడుదల..

శ్రీమతి అనుశ్రీ సమర్పణలో ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ & జేకే క్రియేషన్స్ బ్యానర్‌పై జీడీ.కాశీo నిర్మాతగా జేడీ.చక్రవర్తి, బెనర్జీ, అక్షత, మనోజ్ నందన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘MMOF’. ఈ చిత్ర ట్రైలర్ కార్యక్రమం హైదరాబాద్‌లో సోమవారం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ : ‘MMOF ట్రైలర్ చూశాక నేను స్లో అయ్యనా సినిమా తీసిన వారు ఫాస్ట్‌గా ఉన్నారా అనే అనుమానం కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్తగా ఉంది, ఆడియన్స్‌కు సినిమా చూడాలి అనిపించేలా ఉంది. MMOF యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. జేడీ చక్రవర్తి ఇలాంటి కొత్త కాన్సెప్ట్ మూవీస్ మరెన్నో చెయ్యలని కోరుకుంటున్నా’ అన్నారు. 

MMOF - Trailer

నటీనటులు:
బెనర్జీ, అక్షత, అక్షిత ముద్గల్, శ్రీరామ్ చంద్ర, మనోజ్ నందన్, టార్జాన్, గౌతంరాజు, చమ్మక్ చంద్ర, కిరాక్,ఆర్.పి.
సాంకేతిక నిపుణులు:
సంగీతం: సాయి కార్తీక్ ఫోటోగ్రఫి: ‘గరుడవేగ’ అంజి, ఎడిటర్: ఆవుల వెంకటేష్, డైలాగ్స్: రాఘవ,
నిర్మాతలు: RRR రాజశేఖర్, JD ఖాసిం,
దర్శకత్వం: యన్.యస్.సి.

See Also | అలీ కుమార్తె జవేరియా నటిస్తున్న ‘మా గంగానది’