టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్.. వైరల్ అవుతున్న వీడియో..

చిరంజీవి, మోహన్ బాబు టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్..

  • Published By: sekhar ,Published On : April 1, 2020 / 06:00 PM IST
టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్.. వైరల్ అవుతున్న వీడియో..

చిరంజీవి, మోహన్ బాబు టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్..

మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబులది టామ్ అండ్ జెర్రీ లాంటి స్నేహమని యువ నటుడు, మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో (టిక్ టాక్) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, మార్చి 25న ఉగాది పర్వదినం సందర్భంగా పలు సోషల్ మీడియా మాద్యమాల్లోకి అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఎంట్రీ పై పలువురు ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేయగా, సినిమా ప్రముఖులు ఆయనను సోషల్ మీడియాలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ తమ అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలుపారు.

కలెక్షన్ కింగ్, నటప్రపూర్ణ మోహన్ బాబు, ‘ట్విట్టర్‌కి స్వాగతం మిత్రమా’ అంటూ మెగాస్టార్‌ను ఉద్దేశించి ట్వీట్ చేయగా, ‘రాననుకున్నావా, రాలేననుకున్నావా’ అంటూ సరదాగా మోహన్ బాబు ట్వీట్‌ని మెగాస్టార్ రీట్వీట్ చేశారు. దానికి సమాధానంగా మోహన్ బాబు, ‘ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెప్తాను’ అని రిప్లై ఇవ్వగా.. ‘కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం మిత్రమా.. మీ అమ్మాయి లక్ష్మీని చూసి నేర్చుకో’ అంటూ చిరు ఆటపట్టించిన సంగతి తెలిసిందే.

తాజాగా మా అసోసియేషన్‌లో చిరుని మోహన్ బాబు కంట్రోల్ చేస్తున్న వీడియోని ‘ప్రేమదేశం’ సినిమాలోని ‘ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా’ సాంగ్ బ్యాగ్రౌండ్‌తో ఎడిట్ చేసి ‘పర్ఫెక్ట్ బ్యాగ్రౌండ్ సాంగ్ ఫ్రెండ్స్ ఫరెవర్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మనోజ్ షేర్ చేసాడు. ఎన్నిసార్లు బహిరంగంగా మాటా మాటా అనుకున్నా కలిసిపోవడం చిరు, మోహన్ బాబుల నేచర్ అంటూ ఇద్దరు హీరోల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.