ఐ యామ్ ‘సన్నాఫ్ ఇండియా’..

  • Published By: sekhar ,Published On : August 15, 2020 / 05:25 PM IST
ఐ యామ్ ‘సన్నాఫ్ ఇండియా’..

కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు.. 560 చిత్రాల‌కు పైగా చిత్రాల్లో క‌థానాయ‌కుడు, ప్ర‌తి నాయ‌కుడు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ మ‌ధ్య కాలంలో మోహ‌న్‌బాబు సినిమాలు చాలా సెల‌క్టివ్‌గా చేస్తూ వ‌స్తున్నారు.



స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా తాను చేయ‌బోతున్న కొత్త చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’ అని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు మోహన్‌బాబు. టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. టైటిల్, మోహ‌న్‌బాబు లుక్‌ను ఆకట్టుకుంటున్నాయి. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై మోహ‌న్‌బాబు నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.