Manchu Vishnu Vs Manoj : మా అబ్బాయిల మధ్య ఎలాంటి గొడవలు లేవు.. మోహన్ బాబు భార్య!
మంచు బ్రదర్స్ మనోజ్ (Manchu Manoj) అండ్ విష్ణు (Manchu Vishnu) గొడవకి సంబంధించిన వీడియో నేడు టాలీవుడ్ తీవ్ర దుమారాన్ని లేపింది. దీని పై మోహన్ బాబు భార్య రియాక్ట్ అయ్యింది.

Mohan Babu wife reaction on Manchu Vishnu Vs Manoj issue
Manchu Vishnu Vs Manoj : గత కొన్నిరోజులుగా మంచు కుటుంబం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనికని, మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం పెద్ద చర్చినీయాంశం అయ్యిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు బ్రదర్స్ మనోజ్ (Manchu Manoj) అండ్ విష్ణుకి (Manchu Vishnu) మధ్య విబేధాలు మీడియా వరకు చేరుకున్నాయి. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య మాటలు లేవంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈరోజు మంచు మనోజ్, విష్ణు గొడవకి సంబంధించిన వీడియో ఒకటి బయటకి వచ్చి సెన్సేషన్ అయ్యింది.
Manchu Vishnu Vs Manoj : అన్నదమ్ముల గొడవ పై స్పందించిన మోహన్ బాబు.. నాకేం తెలియదంటున్న మంచు లక్ష్మి!
కొంత కాలంగా మనోజ్ అనుచరుల పై విష్ణు ఏదో విధంగా గొడవకి దిగుతున్నట్లు తెలుపుతూ.. విష్ణు దాడి చేస్తున్న దృశ్యాన్ని మనోజ్ వీడియో తీసి తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యి మీడియాలో హాట్ టాపిక్ అవ్వడంతో మోహన్ బాబు (Mohan Babu) రియాక్ట్ అయ్యాడు. వారిద్దరికీ నచ్చచెప్పి ఆ వీడియోని డిలీట్ చేయించాడు. ఇక దీని పై మంచు లక్ష్మిని (Manchu Lakshmi) ప్రశ్నించగా.. నాకు అసలు ఈ గొడవ గురించే తెలియదు. దాని గురించి తెలియకుండా నేను మాట్లాడను అంటూ బదులిచ్చింది.
తాజాగా దీని పై మోహన్ బాబు సతీమణి మంచు నిర్మల రెస్పాండ్ అయ్యింది. “మా అబ్బాయిల మధ్య ఎలాంటి గొడవలు లేవు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఏదేమైన ఈ వీడియో టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా ఈ విబేధాలకు గల కారణం ఏంటనేది తెలియలేదు. ఇది ఇలా ఉంటే, మనోజ్ వివాహం అయిన దగ్గరనుంచి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనోజ్, మౌనికని చేసుకోవడం మంచు విష్ణుకి ఇష్టం లేదని, అందుకే మనోజ్ పెళ్ళికి కూడా రాలేదని తెలుస్తుంది.