Jailer : రజినీకాంత్ సినిమాలో మోహన్ లాల్ గెస్ట్ అపియరెన్స్..

సూపర్ స్టార్ రజినీకాంత్‌కి రోబో సినిమా తరువాత సరైన హిట్టు ఒక్కటి పడలేదు. ప్రస్తుతం రజిని నటిస్తున్న తాజా చిత్రం 'జైలర్'. డాక్టర్, బీస్ట్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నెల్సన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్..

Jailer : రజినీకాంత్ సినిమాలో మోహన్ లాల్ గెస్ట్ అపియరెన్స్..

Jailer : సూపర్ స్టార్ రజినీకాంత్‌కి రోబో సినిమా తరువాత సరైన హిట్టు ఒక్కటి పడలేదు. దాదాపు 8 సినిమాల్లో నటించిన ఒక చిత్రం కూడా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం రజిని నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. డాక్టర్, బీస్ట్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నెల్సన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే రజినీకాంత్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన టీజర్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

Jailer: ఖైదీ బాటలో జైలర్.. ఒక్క రాత్రిలోనే ముగించేయనున్న రజినీ..?

కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటించబోతున్నాడట. ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర కోసం దర్శకుడు మోహన్ లాల్ ని సంప్రదించడం, దానికి మోహన్ లాల్ కూడా ఒకే చెప్పడం జరిగిందని తెలుస్తుంది. ఈ నెలలో మోహన్ లాల్.. జైలర్ మూవీ సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు. ఈ పాత్ర నిడివి 10-15 నిమిషాల ఉంటుంది అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ఇప్పటికే కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు ఇండస్ట్రీలకు సంబంధించిన బడా స్టార్స్ ఒక సినిమాలో కనిపించబోతుండడంతో.. ఈ చిత్రంపై అంచనాలు మరెంత పెరిగిపోయాయి. అలాగే ఈ సినిమాలో రమ్య కృష్ణన్, వసంత్ రవి, యోగి బాబు మరియు వినాయకన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. మరి రజినీకాంత్ కి ఈ సినిమా అయినా సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.