Mohan Babu : చిరంజీవి మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే బాగున్నాడు: మోహన్ బాబు

బాలకృష్ణ అడిగిన ప్రశ్నల్లో చిరంజీవి గురించి కూడా అడిగారు. బాలకృష్ణ.. చిరంజీవిపై మీకున్న అభిప్రాయం ఏంటి? అని మోహన్‌బాబును అడిగారు. దీనికి మోహన్ బాబు కాసేపు ఆలోచించి చిరంజీవి మంచి

Mohan Babu : చిరంజీవి మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే బాగున్నాడు: మోహన్ బాబు

Unstopable

Mohan Babu :  బాలకృష్ణ తొలిసారి యాంకర్ గా చేస్తున్న షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఈ షో ప్రసారమవుతోంది. దీపావళి సందర్భంగా ఇవాళ ఉదయం బాలకృష్ణ చేసిన తొలి ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది. ఈ షోలో బాలయ్య బాబు తొలి ఇంటర్వ్యూ డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు మోహన్‌బాబు తనదైన శైలిలో ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. మధ్య మధ్యలో మోహన్ బాబు కూడా బాలకృష్ణకు ప్రశ్నలు వేశారు. ఆద్యంతం ఈ మొదటి ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా, నవ్వులతో సాగింది. షో చివర్లో మంచు విష్ణు, మంచు లక్ష్మిలు కూడా జాయిన్ అయ్యారు.

Puneeth Rajkumar : కంఠీరవ స్టేడియంకు బారులు తీరిన అభిమానులు

బాలకృష్ణ అడిగిన ప్రశ్నల్లో చిరంజీవి గురించి కూడా అడిగారు. బాలకృష్ణ.. చిరంజీవిపై మీకున్న అభిప్రాయం ఏంటి? అని మోహన్‌బాబును అడిగారు. దీనికి మోహన్ బాబు కాసేపు ఆలోచించి చిరంజీవి మంచి నటుడు, అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తాడు. వ్యక్తిగతంగా అతనిపై ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. అల్లు రామలింగయ్య గారితో కలిసి నేను ఎన్నో సినిమాలు చేశాను. సురేఖ నాకు సోదరిలాంటిది. అంటే మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. మన ఇంటి అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టే అతను బాగున్నాడు అని ఆసక్తిగా సమాధానం ఇచ్చారు.

Trisha : దుబాయ్ నుంచి అరుదైన గౌరవం అందుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ గా త్రిష

గతంలో చిరంజీవికి, మోహన్ బాబుకి మధ్య మనస్పర్థలు ఉన్నాయని అందరికి తెలుసు. మధ్యలో కొన్ని రోజులు కలిశారు. ఒకరికి ఒకరు సహాయం చేశారు. ఒకరి గురించి ఒకరికి చెప్పుకున్నారు. కానీ ఇటీవల ‘మా’ ఎలక్షన్స్ టైంలో మళ్ళీ వారిద్దరి మధ్య మనస్పర్థలు బయటకి వచ్చాయని అందరూ అన్నారు. ఇలాంటి టైంలో చిరంజీవి గురించి మోహన్ బాబు చెప్పిన మాటలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఈ వీడియో కచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని తెలుస్తుంది.