Mohanbabu: రెచ్చగొట్టకండి.. మీడియా ముందుకు రాకండి.. కలిసి పని చేయండి..!

రెచ్చగొడితే.. జూనియర్ ఆర్టిస్ట్ అయినా రెచ్చిపోతాడని.. అందుకే.. ఎవరూ.. ఎవర్నీ రెచ్చగొట్టకపోవడం మంచిదని సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు.

Mohanbabu: రెచ్చగొట్టకండి.. మీడియా ముందుకు రాకండి.. కలిసి పని చేయండి..!

Mohan

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ – ‘మా’.. అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొడితే.. జూనియర్ ఆర్టిస్ట్ అయినా రెచ్చిపోతాడని.. అందుకే.. ఎవరూ.. ఎవర్నీ రెచ్చగొట్టకపోవడం మంచిదని అన్నారు. మా.. ఎన్నికల్లో రాజకీయాలు చేయాలని చూశారని.. బెదిరింపులకూ దిగారని కామెంట్ చేశారు. చివరికి మంచు విష్ణు విజయం సాధించాడని.. ఇప్పటికైనా అందరూ పగలు పక్కనబెట్టి.. అసోసియేషన్ కోసం కలిసి పని చేయాలని అన్నారు.

”పగ మనిషిని సర్వ నాశనం చేస్తుంది. ఓటు వేయని వారిపై పగ వద్దు. ఎవరైనా సరే. అందరితో కలిసి పని చేయాలి. నాకు రాగద్వేషాలు లేవు. నా బిడ్డను మీ అందరి చేతుల్లో పెడుతున్నా. భారతదేశం గర్వించదగ్గ అసోసియేషన్ గా ‘మా’ ఎదగాలి. తెలంగాణ వేదికగా గెలిచిన ‘మా’ ప్రతినిధులు.. ముందుగా సీఎం కేసీఆర్ ను కలవాలి. వాళ్ల తరఫున నేనూ కేసీఆర్ ను కలుస్తా. ఆయన కళాకారులను ఆదుకుంటారు. మాట ఇస్తే అమలు చేస్తారు. ఏపీ మంత్రి పేర్ని నానిని కూడా కార్యక్రమానికి ఆహ్వానించాం. పండగ అని ఆయన రాలేదు. హాజరైన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు” అని మోహన్ బాబు చెప్పారు.

కార్యక్రమానికి రాని ప్రతి ఒక్కరూ.. మంచు విష్ణుకు సహకరించాలని మోహన్ బాబు కోరారు. ఈ బాధ్యత చాలా కీలకమైనదని.. ఎంత కాలం పదవిలో ఉన్నామన్నది విషయం కాదని.. కళాకారులందరి తరఫున పని చేయాల్సిన ఉన్నతమైన బాధ్యత అని మోహన్ బాబు చెప్పారు. టీమ్ మెంబర్లు.. సమస్య ఉంటే అధ్యక్షుడికి చెప్పుకోవాలని.. ప్రతి చిన్న విషయానికి మీడియా ముందుకు వెళ్లడం సరికాదని.. ఇది ఓ సీనియర్ నటుడిగా హక్కుతో చెబుతున్నానని మోహన్ బాబు కామెంట్ చేశారు.

మంచు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా గెలిచేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మోహన్ బాబు కృతజ్ఞతలు చెప్పారు. దాసరి నారాయణరావు నుంచి మొదలుపెట్టి.. తన సినీ జీవితాన్ని ప్రభావితం చేసిన చాలా మందిని ఆయన తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు.

Read More:

MAA Elections: కోర్టు మెట్లెక్కుతున్న ‘మా’ ఎన్నికల గొడవలు

‘మా’ ఎన్నికల్లో మోసం.. హేమ కీలక వ్యాఖ్యలు _ Hema sensational comments on MAA Elections