Mohanbabu vs Chiranjeevi : ఇండస్ట్రీ పెద్ద ఎవరు?? మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి..

ఇండస్ట్రీ పెద్ద ఎవరు?? ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఉన్న ప్రశ్న ఇండస్ట్రీ పెద్ద ఎవరు? ఇన్నాళ్లు లేని ప్రశ్న ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎవరు ఈ ప్రశ్న

Mohanbabu vs Chiranjeevi : ఇండస్ట్రీ పెద్ద ఎవరు?? మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి..

Chiru

Mohanbabu vs Chiranjeevi :  మొన్నటి దాకా ‘మా’ ఎలక్షన్స్ తో అట్టుడికిన తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మరో వివాదం చెలరేగుతుంది. అదే ఇండస్ట్రీ పెద్ద ఎవరు?? ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఉన్న ప్రశ్న ఇండస్ట్రీ పెద్ద ఎవరు? ఇన్నాళ్లు లేని ప్రశ్న ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎవరు ఈ ప్రశ్న తీసుకువచ్చారు?

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం ఇండస్ట్రీ పెద్ద అంటే దాసరి నారాయణరావు అనే వారు. ఇండస్ట్రీ అంతా ఒప్పుకున్నారు ఇది. సినీ పరిశ్రమలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తాను పరిష్కరించేవారు. ఎవరికైనా సాయం కావాలి అని అడిగినా చేసేవారు. ఎవరి మధ్య అయినా విభేదాలు ఉంటే కూర్చొని మాట్లాడేవారు. ఆయన రాజకీయాల్లోకి కూడా వెళ్లడంతో ప్రభుత్వాలతో ప్రత్యక్షంగా మాట్లాడేవారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ లోటు బాగా కనపడింది. ఇండస్ట్రీని ముందు ఉంది నడిపించే నాయకుడు ఒకడు ఉండాలి. దాసరి పోయిన తర్వాత అలా ఎవరూ ముందుకి రాలేదు.

BiggBoss : ఇదేందిరా బై.. తొక్కలో ఆట… ఏం పీకుతున్నారు.. బిగ్ బాస్‌లో మంటలు

కానీ కరోనా టైంలో ఇండస్ట్రీకి చాలా సమస్యలు వచ్చాయి. ఇండస్ట్రీ కష్టాల్లో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో కచ్చితంగా నాయకుడు కావాలి. నాయకత్వం కోసం కాకపోయినా సినిమా కష్టాల కోసమైనా ఒకరు ముందుకు రావాలి. అలాంటప్పుడు మెగాస్టార్ చిరంజీవి తానే ముందడుగు వేశారు. ఎవరూ చెప్పకపోయినా కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమ కోసం తాను ముందడుగు వేశాడు. సినీ కార్మికులకు ccc ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. నిర్మాతలని ఇంటికి పిలిపించి సినిమాల గురించి మాట్లాడారు. తన తోటి హీరో నాగార్జునని కూడా కలుపుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో సినీ పరిశ్రమ శ్రేయస్సు కోసం మాట్లాడారు. సినీ కష్టాలని ప్రభుత్వాలకి విన్నవించారు. ఇవన్నీ చేసినా అయన ఎక్కడా తాను ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోలేదు. ఎవరూ అనలేదు కూడా. కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకి వచ్చాడు మళ్ళీ కరోనా తగ్గుముఖం పట్టాక తన పని తాను చూసుకుంటున్నాడు మెగాస్టార్. అవసరమైతే మళ్ళీ ముందుకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు.

Avika Gor : నిర్మాతగా మారిన చిన్నారి పెళ్లికూతురు

ఇటీవల ‘మా’ ఎలక్షన్స్ లో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. మంచు విష్ణు పోటీ చేసినా స్వయంగా మోహన్ బాబే పోటీ చేసినట్టు ఉంది. మోహన్ బాబు అన్నిట్లో ఎంటర్ అయ్యారు. ఎలక్షన్ రోజు గొడవలుఅయ్యాయి అని, మోహన్ బాబు తిట్టారని ప్రకాష్ రాజ్ ప్యానెల్ మీడియా ముందే చెప్పారు. ఇక మంచు విష్ణు ప్యానెల్ ని వెనక ఉండి నడిపించిన నరేష్ మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద అని మీడియా ముందు పదే పదే చెప్పారు. మోహన్ బాబు కూడా నరేష్ ని వారించలేదు. కానీ మోహన్ బాబు దాసరి గారి తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరూ లేరు నేను అయన అంతటి వాడ్ని కాదు అని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత కూడా నరేష్ మోహన్ బాబే ఇండస్ట్రీ పెద్ద అని మళ్ళీ వ్యాఖ్యానించారు. ఇక నాగబాబు ఈ కామెంట్స్ పై మాట్లాడుతూ తన అన్నయ్య చిరంజీవి ఎప్పుడూ ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోలేదు, చెప్పడు. అవసరం వస్తే ముందుకి వస్తాడు. మీరు పెదరాయుడిలా తీర్పులిస్తారా అని నరేష్ కి కౌంటర్ ఇచ్చారు. మోహన్ బాబు దాసరి చనిపోయిన తర్వాత ‘మా’ ఎలక్షన్స్ వరకు సినీ పరిశ్రమ గురించి మాట్లాడలేదు. ఇవాళ తన కొడుకుని గెలిపించడానికి బయటకి వచ్చారు అని వినిపిస్తున్నాయి. మోహన్ బాబు జగన్ మోహన్ రెడ్డి బంధువులు కూడా కానీ సినీ పరిశ్రమ గురించి ఏ రోజు ప్రభుత్వంతో మాట్లాడలేదు. అలాంటి ఆయన ఇండస్ట్రీ పెద్ద ఎలా అవుతారు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Freida pinto : ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ హీరోయిన్ కి బేబీ షవర్‌ ఫంక్షన్‌

ఇక చిరంజీవి మోహన్ బాబు మధ్యలో కొన్ని రోజులు విభేదాలు ఉన్నాయన్న సంగతి కూడా అందరికి తెలుసు. ఒకప్పుడు దాసరి గారే వీళ్ళిద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడారు కూడా. ఇటీవల కరోనా టైములో కూడా మోహన్ బాబు చిరంజీవి కలిసి కనిపించారు. ఒకర్నొకరు మిత్రులు అని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద గురించి వీళ్ళిద్దరూ మాట్లాడకపోయినా వీళ్ళ తరుపు వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇద్దరూ ముందుకొచ్చి మాట్లాడట్లేదు. దీంతో ఇది వివాదంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

అసలు ఇండస్ట్రీ పెద్ద అనే పేరు ఎవరికీ ఎవరూ ఇవ్వలేదు. ఎవరూ తీసుకోలేదు. పరిశ్రమ, పరిశ్రమ వ్యక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ముందుకి వచ్చి ఆ కష్టాల కోసం పని చేస్తారో వాళ్లే ఇండస్ట్రీ పెద్ద అని అందరికి తెలుసు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోనవసరం లేదు. ఆ స్థానం కోసం మాట్లాడాల్సిన పని లేదు. ‘మా’ ఎలక్షన్స్ తో మొదలైన రచ్చ ఇప్పటికైనా ఆగాలని చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు అనుకుంటున్నారు. ఎవరో ఒకరు ముందుకి వచ్చి ఈ రచ్చని ఆపకపోతే ఇది ఇంకా తీవ్రంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అభిమానులకి రోల్ మోడల్ గా ఉండాల్సిన ఆర్టిస్టులే ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి ఇండస్ట్రీ పెద్ద ఎవరో ఎవరు డిసైడ్ చేస్తారో, ఇండస్ట్రీ కష్టాలు వస్తే ఎవరు ముందుకొస్తారో చూడాలి మరి.