Mosagallaku Mosagadu : మోసగాళ్లకు మోసగాడు వచ్చేస్తున్నాడు.. రీ రిలీజ్‌కి రంగం సిద్ధం..

సూపర్ స్టార్ కృష్ణ (Krishna) టాలీవుడ్ కి ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే ఫస్ట్ కౌ బాయ్ పిక్చర్ గా మోసగాళ్లకు మోసగాడు (Mosagallaku Mosagadu) చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కి సిద్దమవుతుంది.

Mosagallaku Mosagadu : మోసగాళ్లకు మోసగాడు వచ్చేస్తున్నాడు.. రీ రిలీజ్‌కి రంగం సిద్ధం..

Mosagallaku Mosagadu is ready to re released on Krishna Birthday

Mosagallaku Mosagadu : టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ (Krishna) ఎన్నో ప్రయోగాలు చేశారు. తెలుగు వెండితెరకు ఎన్నో కొత్త విషయాలను, సాంకేతికతను పరిచయం చేసి ప్రయోగాలకు పెద్దపీట వేసేవారు. ఈ క్రమంలోనే తెలుగులో ఫస్ట్ సినిమా స్కోప్ పిక్చర్ – అల్లూరి సీతారామరాజు, ఫస్ట్ 70mm – సింహాసనం, ఫస్ట్ కౌ బాయ్ పిక్చర్ – మోసగాళ్లకు మోసగాడు, ఫస్ట్ జేమ్స్ బాండ్ పిక్చర్ – గూఢచారి 116, ఫస్ట్ ఈస్ట్ మ్యాన్ కలర్ ఫిలిం – ఈనాడు, ఫస్ట్ DTS ఫిలిం – తెలుగు వీర లేవరా.. ఇలా ప్రతి కొత్త టెక్నాలజీని పరిశ్రమకు తీసుకు వచ్చారు. కాగా గత ఏడాది ఆయన మరణం అందర్నీ కలిచి వేసింది.

SSMB28: మహేష్-త్రివిక్రమ్ నెక్ట్స్ అప్డేట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

ఇక మే 31న కృష్ణ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. దీంతో ఈ ఏడాది కృష్ణ బర్త్ డేని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణ ఎవర్ గ్రీన్ మూవీ మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని 4K క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. మే 31న వరల్డ్ వైడ్ గా మోసగాడు మన మనసులు దోచుకోడానికి రాబోతున్నాడు.

ఫస్ట్ కౌ బాయ్ పిక్చర్ గా వచ్చిన ఈ చిత్రం 1971 లో రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని అందుకుంది. కే ఎస్ ఆర్ దాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా ఆరుద్ర కథని అందించాడు. విజయ్ నిర్మల, కృష్ణకి జంటగా నటించింది. ఈ సినిమా తరువాత కౌ బాయ్ కథాంశంతో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. మహేష్ బాబు కూడా ఈ జోనర్ లో ఒక సినిమా చేశాడు. టక్కరి దొంగ అనే సినిమాతో మహేష్.. కౌ బాయ్ గా ఆకట్టుకున్నా, కమర్షియల్ గా ఆ మూవీ హిట్టు కాలేకపోయింది.

Mosagallaku Mosagadu is ready to re released on Krishna Birthday

Mosagallaku Mosagadu is ready to re released on Krishna Birthday