Most Eligible Bachelor : ఆహాలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’

అఖిల్ మొదటి సారి ఈ సినిమాతో హిట్ కొట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో విజయం సాధించాడు. థియేటర్లలో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాని

Most Eligible Bachelor : ఆహాలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’

Meb

Most Eligible Bachelor :  అక్కినేని అఖిల్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. గత నెల దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.

Anushka Shetty : అనుష్క బరువు తగ్గడానికి వాడుతున్న చిట్కాలు ఇవే..

అఖిల్ మొదటి సారి ఈ సినిమాతో హిట్ కొట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో విజయం సాధించాడు. థియేటర్లలో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాని ముందే ఓటిటి సేల్ కూడా చేసేసారు. థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటిటిలో రిలీజ్ అయ్యేలా ఒప్పందం చేసుకున్నారు.

Manchu Lakshmi : మోహన్ లాల్ సినిమాలో మంచు లక్ష్మి ఫిమేల్ లీడ్

తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్ ని అనౌన్స్ చేశారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా డిజిటల్ ప్రీమియర్ నవంబర్ 19న ‘ఆహా’ ఓటిటిలో విడుదల కానుంది. డిజిటల్ రైట్స్ కూడా భారీగా అమ్మినట్టు సమాచారం. అక్కినేని ఫాన్స్ ఈ సినిమాని మరోసారి ఆహాలో చూడటానికి సిద్ధమైపోయారు. ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఆహాలో చూడటానికి రెడీ అయిపోతున్నారు.