బుట్టబొమ్మ వచ్చేసింది.. మరి బ్యాచ్‌లర్‌ బాబు ఎక్కడ?..

  • Published By: sekhar ,Published On : September 14, 2020 / 03:49 PM IST
బుట్టబొమ్మ వచ్చేసింది.. మరి బ్యాచ్‌లర్‌ బాబు ఎక్కడ?..

Most Eligible Bachelor Shooting Starts: అఖిల్‌ అక్కినేని, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.



https://10tv.in/allu-arjun-location-search-for-pushpa-movie-pics-gone-viral/
సోమవారం (సెప్టెంబర్ 14) ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌ను ఇరవై రోజుల లోపు కంప్లీట్ చేస్తే మొత్తం సినిమా పూర్తయిపోతుంది. తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలుపెడతారు. ప్రస్తుతం లొకేషన్‌లో పూజా హెగ్డేపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చాలాకాలం తర్వాత షూటింగ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంటూ లొకేషన్‌లో తీసుకున్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది పూజ.


ఈ నెల 20న అఖిల్‌ యూనిట్‌తో జాయిన్ అవుతాడని సమాచారం. అలాగే అదేరోజు ఈ సినిమాలో అఖిల్ చేస్తున్న ఆదిత్య వాసుదేవన్ క్యారెక్టర్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2021 జనవరి 6న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.