MAA : టాలీవుడ్ సమస్యలపై రంగంలోకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

తాజాగా ఈ సమస్యలని పరిష్కరించేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఇందులో భాగం అవ్వనుంది. రేపు బుధవారం మధ్యాహ్నం ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కీలక సమావేశం......

MAA : టాలీవుడ్ సమస్యలపై రంగంలోకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

Tollywood :  ఇటీవల టాలీవుడ్ వరుస సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు షూటింగ్స్ కూడా ఆపేశారు. నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్, పలు విభాగాలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. నేడు మంగళవారం ఉదయం కూడా ఫిలిం ఛాంబర్ సభ్యులు సమావేశమయ్యారు. ఒక్కో విభాగం ఒక్కో సమస్యపై చర్చిస్తున్నారు. అలాగే ఎగ్జిబిటర్స్ సమస్యలపై చర్చించేందుకు దర్శకుడు తేజ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశారు.

ఇక టాలీవుడ్ కి ఉన్న ముఖ్య సమస్యల్లో ఆర్టిస్టులు, హీరోల రెమ్యునరేషన్ ఒకటి. వారి అసిస్టెంట్స్ ని కూడా నిర్మాతలే చూసుకోవడం ఒకటి. ఈ రెండిటిపై కూడా నిర్మాతలు చర్చించాలి అని ప్రతిపాదించారు. ఇప్పటికే దిల్ రాజు రామ్ చరణ్ తో మాట్లాడి హీరోలతో రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడమని ఒప్పించాడు. త్వరలోనే చరణ్ హీరోలతో సమావేశం అవనున్నాడు.

Prabhas : దుల్కర్ కోసం ప్రభాస్.. సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా..

తాజాగా ఈ సమస్యలని పరిష్కరించేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఇందులో భాగం అవ్వనుంది. రేపు బుధవారం మధ్యాహ్నం ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మరియు మా సభ్యులు హాజరవనున్నారు. ఈ సమావేశంలో సినిమా షూటింగుల నిలుపుదల, ఆర్టిస్ట్ లు, హీరోల రెమ్యునరేషన్ల పై కీలక చర్చ జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సమావేశం జరగనుంది. ఆర్టిస్టులు కూడా ఈ చర్చల్లో భాగమవడంతో రేపటి సమావేశం హాట్ టాపిక్ గా మారింది.