Manoj Manchu: మంచు మ‌నోజ్‌కు క‌రోనా పాజిటివ్

కరోనా మరోసారి విజృంభిస్తోంది. సెలబ్రిటీలు కూడా కరోనా భారిన పడుతున్నారు. హీరో మంచు మ‌నోజ్‌కు కూడా క‌రోనా పాజిటివ్ వచ్చింది.

Manoj Manchu: మంచు మ‌నోజ్‌కు క‌రోనా పాజిటివ్

Manoj Manchu: కరోనా మరోసారి విజృంభిస్తోంది. సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. హీరో మంచు మ‌నోజ్‌కు కూడా క‌రోనా పాజిటివ్ వచ్చింది. ఈ విష‌యాన్ని తానే స్వయంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు మంచు మనోజ్.

‘ఇటీవ‌ల న‌న్ను క‌లిసినవారు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నాను. కరోనాపై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవసరం ఉంది. నా గురించి ఆందోళన అక్కర్లేదు. ప్ర‌స్తుతం బాగానే ఉన్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలే నా బలం. కరోనా సమయంలో జాగ్రత్తగా చూసుకుంటున్న డాక్టర్లు, న‌ర్సులకి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను’ అని మంచు మ‌నోజ్ చెప్పుకొచ్చాడు.