Movie Releases: సినిమా పండగ.. ఈ వారం మొత్తం డజను సినిమాలు వచ్చేశాయ్! Movie Release Festival .. Dozens of movies have arrived this week!

Movie Releases: సినిమా పండగ.. ఈ వారం మొత్తం డజను సినిమాలు వచ్చేశాయ్!

సమ్మర్ మూవీ సీజన్ లో వరుస బెట్టి సినిమాలు బాక్సాఫీస్ ముందు క్యూ కడుతున్నాయి. పెద్ద సినిమాలేమో రెండు వారాలకొక స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఆ గ్యాప్ లో చిన్న సినిమాలు వచ్చి లక్ పరీక్షించుకుంటున్నాయి.

Movie Releases: సినిమా పండగ.. ఈ వారం మొత్తం డజను సినిమాలు వచ్చేశాయ్!

Movie Releases: సమ్మర్ మూవీ సీజన్ లో వరుస బెట్టి సినిమాలు బాక్సాఫీస్ ముందు క్యూ కడుతున్నాయి. పెద్ద సినిమాలేమో రెండు వారాలకొక స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఆ గ్యాప్ లో చిన్న సినిమాలు వచ్చి లక్ పరీక్షించుకుంటున్నాయి. థియేటర్లలో హంగామా ఉంటే మేమేం తక్కువ తిన్నామా అని ఓటీటీలు కూడా హోరా హోరీ పోటీకి దిగుతున్నాయి. మరీ ఈ వీక్ ఏఏ సినిమాలు సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నాయి.. ఎవరెవరు ఓటీటీ బరిలోకి దిగుతున్నారో.. ఇప్పుడు చూద్దాం.

Jayamma Panchayathi: స్టార్ హీరోలందరినీ వాడేస్తున్న జయమ్మ.. ఈసారి ఎవరంటే?

తన యాంకరింగ్ తో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సుమ లీడ్ క్యారెక్టర్ లో జయమ్మ పంచాయితి సినిమా చేసింది. విలేజ్ లో గొడవలు, సమస్యలు, అనుబంధాల పైన జయమ్మ ట్రయిలర్ తోనే ఆకట్టుకుంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించిన ఈ సినిమా మే 6న రిలీజ్ అయింది. దాదాపు అందరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా సుమక్క సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు.

Bhala Thandanana: ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్.. భళా తందనాన ట్రైలర్

విశ్వక్ సేన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా కూడా మే 6న రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే విశ్వక్ సేన్ వివాదంలో చిక్కుకున్నారు. రుక్షర్ ఢిల్హాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను విద్యాసాగర్ తెరకెక్కించారు. ఈ మూవీ టీజర్‌, సాంగ్స్ కి హ్యూజ్ రెస్పాన్స్ దక్కింది.\

Ashoka Vanamlo Arjuna Kalyanam: విశ్వక్ సేన్ విశ్వప్రయత్నాలు.. ఫలించేనా?

మాస్ హిట్ కోసం చూస్తున్న శ్రీవిష్ణు భళాతందనాన సినిమా కూడా మే 6న రిలీజ్ అయింది. చైతన్య దంతులూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేథరిన్ తెరిసా నటిస్తుంది. ఈ సినిమాలు ఏ రేంజ్ హిట్ ను సొంతం చేసుకుంటుందో ఈ ప్రైడే టాక్ ని బట్టి తెలిసిపోతుంది. ఇక ఈ శుక్రవారం తెలుగుతో పాటు రిలీజ్ అయిన బాలీవుడ్ అండ్ హాలీవుడ్ సినిమాలు.. అనిల్ కపూర్ థార్.. దివ్యేన్దు శర్మ మెరే దేశ్ కీ ధర్తీ ఇంకా ది కన్వర్షన్ తో పాటు, బెనెడిక్ట్ కంబర్బాచ్ నటించిన డాక్డర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ హాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.

Movie Releases: ఈ వారం థియేటర్లలో రానున్న సినిమాలివే

ఇక ఓటీటీలు అసలు తగ్గేదేలే అంటూ కంటెంట్ ఇచ్చేస్తున్నాయి. కీర్తి సురేష్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘చిన్ని'( తమిళ్ లో ‘సాని కాయిధం’) చిత్రం మే 6 నుండీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ మొదలైంది. ప్రభాస్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘రాధేశ్యామ్‌’ మూవీ…ఆల్రెడీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఓటిటి రిలీజ్ కాగా హిందీ వర్షన్‌ మే 4 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేశారు. ఈ కన్నడ మూవీ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మే 5 నుండీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ఇస్తున్నారు.

OTT Release: భారీ సినిమాలు.. ఈ నెలలో ఓటీటీలో బిగ్ ఫెస్టివల్!

వీటితో పాటు.. ది వైల్డ్ ఈ వెబ్ సిరీస్ మే 6నుండీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, థార్ మూవీ మే 6 నుండీ నెట్ ఫ్లిక్స్ లో, హాలీవుడ్ మూవీ 40 ఇయర్స్‌ యంగ్‌ మే 4 నుండీ నెట్ ఫ్లిక్స్ లో, వెబ్‌సిరీస్‌ ది సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ మే6 నుండీ నెట్ ఫ్లిక్స్ లో, హిందీ వెబ్ సిరీస్ హోమ్ శాంతి మే 6 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో, ఈ హిందీ సిరీస్ స్టోరీస్‌ ఆన్‌ది నెక్ట్స్‌ పేజ్‌ మే 6 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో, హిందీ మూవీ ఝండ్‌ మే6 నుండీ జీ5లో స్ట్రీమింగ్ మొదలైంది.

×