Movie Releases: ఈ వారం థియేటర్లలోకి వచ్చిన సినిమాలివే!

సమ్మర్ మూవీ సీజన్ షురూ అయింది. వరుస సినిమాలు బాక్సాఫీస్ కు క్యూకడుతున్నాయి. పెద్ద సినిమాలేమో రెండు వారాలకొక స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా కళ మొదలైన..

Movie Releases: ఈ వారం థియేటర్లలోకి వచ్చిన సినిమాలివే!

Movie Releases

Movie Releases: సమ్మర్ మూవీ సీజన్ షురూ అయింది. వరుస సినిమాలు బాక్సాఫీస్ కు క్యూకడుతున్నాయి. పెద్ద సినిమాలేమో రెండు వారాలకొక స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా కళ మొదలైన తర్వాత ఈ వీక్ కూడా సినిమాలు సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేశాయి. ఈ వారం థియేటర్ రిలీజైన సినిమాలివే.

Movie Releases: కళకళాడుతున్న టాలీవుడ్.. ఎటు చూసినా ఫుల్ జోష్!

కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్.. రీసెంట్ గా రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ నుంచి ఈ శుక్రవారం స్టాండప్ రాహుల్ థియేటర్స్ కి వచ్చేశాడు. రాజ్‌ తరుణ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్ తోనే అట్రాక్ట్ చేసింది. స్టాండప్ కామెడీ, లవ్ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో శాంటో మోహన్‌ వీరంకి ఈ సినిమాను తెరెకక్కించాడు.

Movie Releases: సినిమా చూపిస్తా మావా.. టాలీవుడ్ సినిమా సందడి షురూ!

సస్పెన్స్ థ్రిల్లర్ ‘డైరెక్టర్’ మూవీ మార్చ్ 18నే ఖర్చీఫ్ వేసింది. ఇక అమిత్‌ తివారి, భానుశ్రీ జంటగా నటించిన సినిమా నల్లమల. రవి చరణ్‌ తెరకెక్కించిన ఈ మూవీ కూడా ఈ వారమే థియేటర్స్ కి వచ్చేసింది. నాజర్‌, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్‌ వంటి వారు నటించిన ఈ మూవీ టీజర్‌, సాంగ్స్ కి హ్యూజ్ రెస్పాన్స్ దక్కింది.

Movie Releases: సినిమా సీజన్‌గా మార్చి నెల.. అన్నీ క్రేజీ సినిమాలే!

అక్షయ్‌కుమార్‌ హీరోగా, కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరోయిన్లుగా నటించిన సినిమా ‘బచ్చన్‌ పాండే’. ఇది తమిళ్ సూపర్ హిట్ జిగర్తాండ మూవీకి రీమేక్‌ ఇది. ఇదే సినిమా తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా వచ్చి ఇక్కడా సక్సెస్ సాధించింది. హై ఎండ్ ప్రమోషన్స్ తో నార్త్ ఆడియెన్స్ లో అక్షయ్ కుమార్ క్యూరియాసిటీ బాగానే క్రియేట్ చేశాడు. మరి బచ్చన్ పాండే ఏం రేంజ్ హిట్ కొడుతుందో… ఈ ప్రైడే తెలిసిపోతుంది.