Singareni Movies : ‘సింగరేణి’ సినిమాలు..

Singareni Movies : ‘సింగరేణి’ సినిమాలు..

Singareni Movies

Singareni Movies: తెలంగాణలో షూటింగుల సందడి మొదలైంది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లోనూ మేకర్స్ షూటింగ్ జరుపుతున్నారు. అలాగే కథ పరంగా సింగరేణి బొగ్గు గనుల్లోనూ పలు తెలుగు సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. ప్రస్తుతం ‘రెబల్ స్టార్’ ప్రభాస్ కొత్త సినిమా ‘సలార్’ సింగరేణిలోనే షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ షూటింగ్ జరుపుకున్నా సినిమాలేంటో చూద్దాం..

‘నిప్పు రవ్వ’..
నటసింహా నందమూరి బాలకృష్ణ, విజయశాంతి జంటగా ఎ.కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ ‘నిప్పు రవ్వ’.. ఈ మూవీలో సింగరేణి కార్మికుడి పాత్రలో కనిపించారు బాలయ్య. సినిమా మేజర్ పార్ట్ బొగ్గుగనుల్లోనే చిత్రీకరించారు.

 

Nippu Ravva
‘లీడర్’..
దగ్గుబాటి ఫ్యామిలీ నుండి రానా హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘లీడర్’.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఏవీఎమ్ నిర్మించింది. ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా షూటింగ్ కూడా సింగరేణిలో జరిపింది.

Leader
‘వరల్డ్ ఫేమస్ లవర్’..
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా షూటింగ్ నిమిత్తం సింగరేణి ప్రాంతంలో సంచరించారు. విజయ్, క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో.. కె.ఎస్.రామారావు బ్యానర్ క్రియేటివ్ కమర్షియల్స్ లో వచ్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’.. ఈ సినిమాలో సింగరేణిలో వర్క్ చేసే శీను క్యారెక్టర్లో కనిపించారు విజయ్.

World Famous Lover
‘సలార్’..
‘రెబల్‌ స్టార్’ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే సింగరేణిలో స్టార్ట్ అయ్యింది. కొద్దిరోజుల పాటు బొగ్గు గనుల్లో షూటింగ్ చెయ్యనుంది ‘సలార్’ టీమ్.

Salaar